ముంచంగిపుట్టులో కుండపోత

ABN , First Publish Date - 2021-07-30T05:15:30+05:30 IST

మండల పరిధిలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లక్ష్మీపురం, బరడ, బుంగాపుట్టు, రంగబయలు, బూసిపుట్టు, సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు తదితర పంచాయతీల్లో పలుచోట్ల మత్స్యగెడ్డ పాయలు, వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ముంచంగిపుట్టులో కుండపోత
లబ్బూరు సమీపంలో ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు


ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు 

ముంచంగిపుట్టు, జూలై 29: మండల పరిధిలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లక్ష్మీపురం, బరడ, బుంగాపుట్టు, రంగబయలు, బూసిపుట్టు, సుజనకోట, పెదగూడ, జోలాపుట్టు తదితర పంచాయతీల్లో పలుచోట్ల మత్స్యగెడ్డ పాయలు, వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం పంచాయతీ బిర్రుగూడ సమీపంలో మత్స్యగెడ్డ పాయ వరదనీటితో ఉధృతంగా ప్రవహించడంతో మూడు పంచాయతీల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై పలుచోట్ల వర్షపు నీరు ప్రవహించింది. మట్టిరోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో రాకపోకలకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 

 


 

Updated Date - 2021-07-30T05:15:30+05:30 IST