Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుఫాన్‌ను ఎదుర్కోవడానికి విద్యుత్‌ శాఖ సన్నద్ధం

298 బృందాలు..2,983 మందితో సహాయక చర్యలు

ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌కుమార్‌

విశాఖపట్నం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జవాద్‌ తుఫాన్‌ను ఎదుర్కొనడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని ఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు ఐదు జిల్లాల అధికారులను ఆదేశించారు. కార్పొరేట్‌ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు. ప్రతి పట్టణంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. పడిపోయిన విద్యుత్‌స్తంభాలు, తెగిన తీగలను, ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే సరిచేయాలని సూచించారు. ఇందుకోసం ఐదు జిల్లాల్లో 2,983 మందితో 298 బృందాలను ఏర్పాటు చేశామని, వారికి అవసరమైన  పరికరాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్‌ చాట్‌ నంబరు 8500001912కు కూడా ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు రాజబాపయ్య, రమేశ్‌ప్రసాద్‌, చంద్రం, సీజీఎం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement