Abn logo
Aug 16 2021 @ 19:08PM

గాంధీజీ ప్రత్యేకత అదే: రాహుల్

వయనాడ్: జాతిపిత మహాత్మాగాంధీ ఏదైతే చెప్పేవారే అదే ఆచరణలో చూపించేవారని, అదే ఆయనలో ఉన్న గొప్పతనమని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం సహసానికి పెట్టింది పేరని గాంధీ చెబితే, ఆయన కూడా సహనమే మూర్తీభవించిన వ్యక్తిలా ఉండేవారని అన్నారు. భారతదేశ మహిళలను గౌరవంతో చూడాలని ఆయన చెబితే మహిళల పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరించే వారని రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్ జిల్లా మనంతవాడీలోని గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాహుల్ గాంధీ సోమవారంనాడు ఆవిష్కరించారు. గాంధీజీ ఆశయాలు, కన్నకలలను సాకారం చేసేందుకు అంతా కంకణబద్ధులై ఉండాలని అన్నారు. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం రాహుల్ వచ్చారు. మంగళవారంనాడు కల్‌పెట్టా జిల్లా కలెక్టర్‌తో సమావేశమవుతారు. అనంతరం కారస్సెరీ పంచాయత్ ఫార్మర్స్ డే‌లో పాల్గొంటారు.