Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐక్య పోరాటాలతోనే డిమాండ్ల సాధన

ఏపీజేఏసీ మార్కాపురం తాలూకా చైర్మన్‌ బీవీఎస్‌ శాస్త్రి

రెండో రోజు కొనసాగిన  ఉద్యోగుల నిరసనలు

మార్కాపురం, డిసెంబరు 7 : ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్ర మాలను విజయవంతం చేయాలని, ఐమైక్య పోరాటాలతోనే  డిమాండ్లను సాధించు కోగలమని  ఏపీ జేఏసీ మార్కాపురం తాలూ కా చైర్మన్‌  బీవీ శ్రీనివాసశాస్త్రి అన్నారు. ప ట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ  ఉద్యో గులకు సం బం ధించి 72 ప్రతిపాదనలను ప్రభుత్వం ముం దుంచిందన్నారు. ప్రతి పక్షనేతగా పాద యాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరలే దన్నారు. వెంటనే సీపీఎస్‌ రద్దును అమలు చేయాలన్నారు ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు వెలంటనే పరిష్కరించా లన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘ నా యకులు నాగేంద్రరెడ్డి, పండిత పరిషత్‌ రాష్ట్ర నాయకులు రవిచంద్ర, గోపాలుని రమేష్‌బా బు, ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

సీపీఎస్‌ రద్దు చేయాలి

గిద్దలూరు, డిసెంబరు 8 : డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు 2వ రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. పలు శాఖల ఉద్యోగులు తాము పని చేసే కార్యాలయాల ఎ దుట భోజన విరామ సమయంల నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  ఎన్జీవో సంఘ అధ్యక్షుడు నరేష్‌బాబు మాట్లాడుతూ సీపీ ఎస్‌ను రద్దు చేయాలని, పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. సీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు ఉ ద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, అంతవరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కు ద్దూస్‌, అటవీశాఖ కార్యాల య సిబ్బంది పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో విధులకు

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వైద్యశాలల్లో  ఏఎన్‌ఎంలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం వి ధులకు హాజరయ్యారు. రాష్ట్ర ఎన్జీవో నాయ కత్వం పిలుపు మేరకు ప్రభత్వం ఉద్యోగుల 71 సమస్యలను పరిష్కరించే వరకు  నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు అవుతామని ఎన్జీవో  కార్యదర్శి  సీహెచ్‌.రవికుమార్‌ తెలిపారు. వి ధులకు ఆటంకం లేకుండా నల్లబ్యాడ్జీలతో నిరసనలు ఉంటాయని తెలిపారు. 


Advertisement
Advertisement