పీఆర్‌సీ జీవోను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-25T04:29:32+05:30 IST

కొత్త పీఆర్‌సీతో ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని, వెంటనే ఈ కొత్త పీఆర్‌సీని రద్దు చేయాలని ఏఐటీయుసీ అనుబంధ ఏపీ మున్సిపల్‌ వర్కర్‌ యూనియన్‌ అధ్యక్షుడు బి.రామయ్య డిమాండు చేశారు.

పీఆర్‌సీ జీవోను రద్దు చేయాలి
అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్మిక నేతలు

ప్రొద్దుటూరు, జనవరి 24 : కొత్త పీఆర్‌సీతో ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని, వెంటనే ఈ కొత్త పీఆర్‌సీని రద్దు చేయాలని ఏఐటీయుసీ అనుబంధ ఏపీ మున్సిపల్‌ వర్కర్‌ యూనియన్‌ అధ్యక్షుడు బి.రామయ్య డిమాండు చేశారు. సోమవారం కొత్త పీఆర్‌సీకి వ్యతిరేకంగా మున్పిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆ యూనియన్‌ నేతృత్వంలో మున్సిపల్‌ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పీఆర్‌సీ రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ ప్రకటించాలన్నారు. 2019 నుంచి ఆడవారికి రక్షణ జాకెట్లు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలన్నారు. అనంతరం మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పెద్ద ఓబులేసు, సురేష్‌, గురుమూర్తి, పవన్‌కుమార్‌, ప్రమీలారాణి, సరోజమ్మ, రూబెన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:29:32+05:30 IST