Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

యూటీఎఫ్‌ నేత పాపారావు డిమాండ్‌

చినగంజాం, నవంబరు 30: పీఆర్సీని వెంటనే ప్రకటిం చాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సిద్ధం పాపా రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక జడ్పీ పాఠ శాల ఆవరణలో జరగిన ఫెడరేషన్‌ మండల సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి మండల అధ్యక్షుడు కె.నర సారెడ్డి అధ్యక్షత వహించగా, పాపారావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కు పీఆర్‌సీని, బకాయిలు ఉన్న డీఏలను విడుదల చే యాలన్నారు. ముఖ్యమంత్రి  ఎన్నికల సందర్భంగా ఇచ్చి న సీపీఎస్‌ రద్దు హామీని అమలు చేయా లన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలని పేర్కొన్నారు. ఉ పాధ్యాయుల బోధనకు ఆటంకంగా ఉన్న యూప్‌లను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మండల అధ్యక్షుడిగా నరసారెడ్డి

అనంతరం యూ టీఎఫ్‌  మండల నూ తన కార్యవర్గాన్ని ఏక గ్రీవంగా ఎన్నుకు న్నా రు. మండల అధ్యక్షుడి గా కె.నరసారెడ్డి, ప్ర ధాన కార్యదర్శిగా షేక్‌ నాయాబ్‌ రసూల్‌, గౌ రవాధ్యక్షుడిగా డి.హ రిపురుషోత్తం, అసోసియేట్‌ అధ్యక్షులుగా సీహెచ్‌ వెంకట్‌, టి.సౌజన్య, కోశాధికారిగా కె.నాగరాజు, మహిళా కన్వీనర్‌గా పర్వత రెడ్డి సరళను ఎన్నుకున్నారు. అలాగే, జిల్లా కౌన్సిలర్‌లు, ఇతర కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 

Advertisement
Advertisement