టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్ట మరింతగా పెంచాలి

ABN , First Publish Date - 2022-01-28T05:38:02+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ముధోల్‌ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి పార్టీ ప్రతిష్ట మరింతగా పెంచి ప్రజలు ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్ట మరింతగా పెంచాలి
మాట్లాడుతున్న ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 27 : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ముధోల్‌ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి పార్టీ ప్రతిష్ట మరింతగా పెంచి ప్రజలు ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నూతన పార్టీ అధ్యక్షుడు విఠ ల్‌రెడ్డిని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఆయనను అభినందిస్తూ సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి అనే పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వాటన్నింటినీ ప్రజల వద్దకు చేర్చాలన్నారు. నూ తన అధ్యక్షుల సారధ్యంలో పార్టీ బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలను కలుపుకుపోతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విఠల్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజావిశ్వాసం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, వైస్‌చైర్మన్‌ సాజిద్‌, అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిని కలిసి నాయకులు

నిర్మల్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయిన ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని పట్టణంలోని క్యాంపు కార్యా లయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పాకాల రాంచందర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అంద జేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

మంత్రిని కలిసిన అధికారులు

నిర్మల్‌ కల్చరల్‌ : జాతీయ రహదారి 61 రోడ్డు కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు చెట్లు తొలగించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చినందున పలువురు కాంట్రాక్టర్లు, అధికారులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆయన నివాసంలో గురువారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈఈ సీహెచ్‌ కాంతారావు, డీఈఈ సుభాష్‌, లెక్‌కాన్‌ ప్రతినిధులు సాయిరాం, నాగేందర్‌ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. 

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం  

ముథోల్‌ : జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ముథోల్‌ ఎమ్మెల్యే జి. విఠల్‌ రెడ్డిని ఆయా మండలాలకు చెందిన పార్టీ  నాయకులు ప్రజా ప్రతినిధులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మరిన్ని పదవులను అదిరోహించాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సాగౌడ్‌, ఎంపీటీసీ గంగాధర్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌ గౌడ్‌, పోతన్న యాదవ్‌, రమేష్‌, అప్రోజ్‌ఖాన్‌ ఖాలీద్‌ తదితరులు పాల్గొన్నారు. 

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట

లోకేశ్వరం, జనవరి 27 : రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ముధోల్‌ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కనకాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన డబుల్‌బెడ్‌రూమ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనను లోకేశ్వరం మండల నాయకులు పూలమాలతో ఘనంగా సత్క రించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్‌ శ్యాంసుందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌రావు, మండల టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ శ్యాంసుందర్‌, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:38:02+05:30 IST