విమాన ఇంధనం భగ్గు

ABN , First Publish Date - 2021-03-02T07:17:04+05:30 IST

విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర మరింత భగ్గుమంది. చమురు విక్రయ కంపెనీలు ఈ ఇంధనం ధరను సోమవారం 6.5 శాతం పెంచాయి

విమాన ఇంధనం భగ్గు

న్యూఢిల్లీ, మార్చి 1: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర మరింత భగ్గుమంది. చమురు విక్రయ కంపెనీలు ఈ ఇంధనం ధరను సోమవారం 6.5 శాతం పెంచాయి. దీంతో కిలో లీటరు జెట్‌ ఇంధన ధర ఢిల్లీలో రూ.3,663 పెరిగి రూ.59,400.91కి చేరుకుంది. గత ఫిబ్రవరి నుంచి మూడుసార్లు విమాన ఇంధనం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏటీఎఫ్‌ ధరలనూ చమురు కంపెనీలు పెంచుతున్నాయి. తాజాగా పెరిగిన రేట్లతో ఎయిర్‌లైన్స్‌ మార్జిన్లపై మరింత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు వరుసగా రెండో రోజైన సోమవారం యథాతథంగా కొనసాగాయి. 

Updated Date - 2021-03-02T07:17:04+05:30 IST