Abn logo
Sep 28 2021 @ 00:00AM

90 డాలర్లకు చమురు ధర?

  • భారత్‌పై మరింత భారం :  గోల్డ్‌మన్‌ శాక్స్‌


న్యూఢిల్లీ: ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. గత వారం మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు దర ప్రస్తుతం 78-80 డాలర్ల మధ్య ట్రేడవు తోంది. ఈ ఏడాది చివరికల్లా ఇది 90 డాలర్లకు చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌  పేర్కొంది. డెల్టా వేరియంట్‌ కొవిడ్‌ ప్రభావం పెద్దగా లేకపోవడంతో డిమాండ్‌ భారీగా పుంజు కోవడం, అమెరికాను కుదిపేసిన రెండు హరికేన్లతో అక్కడ చమురు ఉత్పత్తి అంతరాయం ఏర్పడడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది.


ఇదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడే ప్రమాదం ఉంది. భారత రోజువారీ 50 లక్షల బ్యారళ్ల ముడి చమురు అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతి చేసుకోవాల్సిందే. అయితే మరో కొవిడ్‌ వేరియంట్‌ తలెత్తినా.. ఒపెక్‌ దేశాలు కోటాకు మించి ఉత్పత్తి పెంచినా.. చమురు మంట పెద్దగా ఉండక పోవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా.