ప్రైవేటు మెడికల్‌ కాలేజీలన్నీ కరోనాకే

ABN , First Publish Date - 2020-03-30T09:55:18+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 22 ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లోని

ప్రైవేటు మెడికల్‌ కాలేజీలన్నీ కరోనాకే

నేటి నుంచే అమలు.. ఓపీ పూర్తిగా బంద్‌

22 ప్రైవేటు మెడికల్‌ 

ఇతర ఆస్పత్రులకు ఇన్‌ పేషంట్ల తరలింపు

236 ఐసీయూలు, 80 వెంటిలేటర్లు సహా

అందుబాటులోకి 3350 ఐసొలేషన్‌ పడకలు

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను సర్కారు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 22 ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లోని పడకలన్నింటినీ కరోనా బాధితులకు సేవలందించేందుకే వినియోగించాలని నిర్ణయించింది. దీంతో ఆయా కాలేజీల్లోని 3,350 ఐసోలేషన్‌ పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈమేరకు ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలను ఒప్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, కాళోజీ హెల్త్‌ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇందులోభాగంగా మెడికల్‌ కాలేజీల్లో ఓపీ సేవలను సోమవారం నుంచి పూర్తిగా రద్దు చేశారు.


ఓపీ సేవల కోసం ఎవరూ రావొద్దని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఉన్న ఇన్‌పేషంట్లను ఇతర బ్రాంచ్‌ ఆస్పత్రులకు తరలించాలని, జిల్లాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీలకు ఇతర బ్రాంచ్‌లు లేకపోతే.. జిల్లా ఆస్పత్రులకు తరలించాలని సర్కారు ఆదేశించింది. కాగా, 22 మెడికల్‌ కాలేజీల్లో వసతులు, వైద్య సిబ్బందిని ప్రభుత్వం ఉచితంగానే వినియోగించుకోనుంది. సిబ్బంది జీతభత్యాలను కూడా ప్రైవేటు యాజమాన్యాలే భరిస్తాయి. అయితే, వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన స్వీయ రక్షణ పరికరాలు, ఇతర సర్జికల్‌ ఐటెమ్స్‌, మాస్కులు, శానిటైజర్స్‌తోపాటు భోజన వసతికి అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరించనుంది.


ఇందుకోసం రూ.30కోట్లు ఖర్చు పెట్టనుంది. కాగా, ఆయా కాలేజీల్లో విద్యనభ్యసిస్తోన్న ఎంబీబీఎస్‌ మొదటి, రెండో, మూడో సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ఇళ్లకు పంపారు. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పీజీ చేస్తున్న వారి సేవలను మాత్రం వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం సర్కారీ ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌, ఐసీయూ సేవలున్నా.. కొందరు రోగులు భయపడి రావడం లేదు. అటువంటి వారు ఇక్కడికొస్తారని సర్కారు భావిస్తోంది. 

Updated Date - 2020-03-30T09:55:18+05:30 IST