Abn logo
Sep 25 2021 @ 00:12AM

అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలి

తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు

తర్లుపాడు, సెప్టంబరు 24: అంగన్‌వాడీ, ఆశావర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు బాలమ్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాల నిధులు పెంచాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ , పింఛన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో శివ, జ్యోతి, నాగమ్మ, రాజకుమారి, అనంతలక్ష్మి, ముంతాజ్‌, మల్లేశ్వరి, హైమావతి, పద్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం: అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐ విజయభాస్కర్‌కు, పీహెచ్‌లో డాక్టర్‌ నాగేశ్వర్‌నాయక్‌కు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. 

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనాతో మృతి చెందిన వారికి రూ. 50 లక్షల బీమా వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డి.శ్రీనివాస్‌,  బాణాల రామయ్య,  పిచ్చయ్య, అరుణ, విజయలక్ష్మీ, సుశీల, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల: ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు సిఫోరా మాట్లాడుతూ ప్రధానంగా స్ర్తీ శిశు సంక్షేమం, విద్య వైద్యం, పేదరిక నిర్మూలనా, ఉపాధీ హామీ తదితర పధకాలలో పని చేసే వారిని కార్మికులుగా గుర్తించాలని, సర్వీసును పరిగణలోకి తీసుకుని రెగ్యులర్‌ చేయాలని కోరారు. 

ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనాకు గురై మృతి చెందిన వారికి 50 లక్షలు ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారు వేణుగోపాల్‌కు అందజేసింది. కార్యక్రమంలో ముంతాజ్‌బేగం, దానమ్మ, రత్నమ్మ, సౌజన్య, ప్రవీణ్య, వెంకటలక్ష్మీ, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీతాలు పెంచాలని కోరుతూ ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక పోవడమే కాకుండా గత 30నెలలుగా  జీతాలు పెంచలేదని కార్యకర్తలు పేర్కొన్నారు. పనిభారం పెరిగిందని, తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకొని జీతాలు పెంచాలని  డిమాండ్‌ చేశా రు. పర్మినెంటు ఉద్యోగులుగా గుర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రాయితీలు అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కల్పించాలని కోరారు.

స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నుంచి తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అం గన్‌వాడీ కార్యకర్తల వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురా లు జె.సీతమ్మ, సుభాషిణి, టి.సుబ్బమ్మ, రామకుమారి, పద్మావతి, ఉషశ్రీ, పద్మావతి, రూత్‌మేరి, వెంకటరమణమ్మ, మూడు మండలాలనుంచి  వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఐటీయూ నాయకుడు బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌): స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఖాసీం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంక్షేమ స్కీమ్‌లన్నింటిని సంస్థాగతం చేసి అందులో పనిచేస్తున్న వారందరిని రెగ్యులర్‌ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. రిటైర్‌ అయిన సందర్భంగా ఐదు లక్షలు ఇవ్వాలని, అప్పటికీ పనిచేస్తున్న జీతంలో సగం వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ వారియర్స కార్మికులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలన్నారు. మధాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లిం చాలన్నారు. కార్యక్రమంలో లక్ష్మీ, రామిరెడ్డి, గురునాథం, అల్లూరిరెడ్డి, కొండమ్మ, కరుణ, పద్మ, సులోచన, సునీత, గీత పాల్గొన్నారు.

పొదిలి: స్కీర వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.21వేలు అమలు చేయాలని సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం.రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద స్కీం వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ స్కీం వర్కర్లను ఉపయోగించుకొని ప్రభుత్వ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కనీస వేతనాలు లేకుండా చాకిరి చేయించుకుంటున్నారన్నారు. స్కీం వర్కర్లను రెగ్యులర్‌ చేసి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, చివరి వేతనంలో సగం ఫెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ళస్థలాలు , రేషన్‌కార్డుల మంజూరు, అమ్మఒడి వంటి వాటిని రూ.10 వేలుకు మించి వేతనం వస్తుందనే పేరుతో కోత పెడుతున్న ప్రభుత్వ పథకాలను తిరిగి వారికి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దొంగరేషన్‌ కార్డులతో కోటీశ్వరులు సైతం ప్రభుత్వ పథకాలను అనుభ విస్తుంటే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు కోత విధించడం దారుణమన్నారు.అనంతరం ఇన్‌చార్జి ఆర్‌ఐ కె.సుబ్బారావు కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పొదిలి ప్రాజెక్టు యూనియన్‌ నాయకురాలు ఎం.శోభారాణి, కార్యకర్తలు అరుణ, పద్మ, శారద, మధ్యాహ్న భోజన పధకం కార్మికులు బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.