Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, డిసెంబరు7: సమస్యలు పరిష్కరించా లని మంగళవారం అడ పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆశావర్కర్లు వైద్యాధికారి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీసవేతనం ఇవ్వాలని, ఇతరసమస్యలను వెంటనే పరిష్కరించా లని కోరారు. ఆశావర్కర్ల సంఘం నాయకురాలు స్వరూప, కవిత, అమృత పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలో వివిధ సబ్‌సెంటర్ల పరిధిలో పనిచేస్తున్న తమకు ఫిక్స్‌డ్‌ వేత నాలు అందించాలని మంగళవారం వైద్యాధి కారి సతీష్‌కు ఆశావర్కర్లు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్‌, ఆశావర్కర్ల సంఘం నాయకులు సరోజ, బాగుబాయి, పుల్లుబాయి, ఇస్రుబాయి, మాల్కు బాయి, స్రవంత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement