భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-03T06:06:38+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరెళ్ల నర్సింహ అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మోత్కూరులో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరెళ్ల నర్సింహ

మోత్కూరు, డిసెంబరు2: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరెళ్ల నర్సింహ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని భువన నిర్మాణ కార్మి కులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మోత్కూరులో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడారు. కార్మికులు ఎన్నో పోరా టాల ఫలితంగా సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మిక చట్టం, సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మికుల సంక్షేమ చట్టాలను సంరక్షించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్‌ మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే శ్రీను, ఉపా ధ్యక్షుడు కందుకూరి నర్సింహ, బద్దం సత్తిరెడ్డి, పోలెపాక నర్సింహ, తొట్ల యాదగిరి, భాస్కర్‌, వెంకన్న, శ్రీశైలం, నవీన్‌ పాల్గొన్నారు.

చట్టాలను పునరుద్ధరించాలి: పాండు

భువనగిరి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన భవన నిర్మాణ చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని సీఐటియూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు డిమాండ్‌ చేశారు. భువనగిరిలో నిర్వహిం చిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలువురు కార్మి కులు పనులకు వెళ్లకుండా సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు మాయ కృష్ణ, ప్రసాద్‌, లక్ష్మణ్‌, సోములు, నర్సమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. 

  అడ్డా స్థలాన్ని కేటాయించాలి: సీఐటీయూ

 వలిగొండ: భవన నిర్మాణ కార్మికులకు వలిగొండ మండల కేంద్రంలో అడ్డా స్థలాన్ని కేటాయించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్క పల్లి సురేందర్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాధారపు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వ హించిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు నర్సింహ, ఎల్ల స్వామి, కుమార్‌, రాజు, శ్రీను, అంజయ్య, వెంకటేశం, రాంచంద్రం, ఎల్లయ్య, లక్ష్మయ్య, రాజయ్య, నర్సింహ పాల్గొన్నారు.

సిమెంట్‌, స్టీల్‌ ధరల పెరుగుదలతో మందగించిన పనులు

 సంస్థాన్‌ నారాయణపురం: సిమెంట్‌, స్టీల్‌ ధరలతో నిర్మాణ పనులు మందగించడంతో పనులు లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు భవన నిర్మాణ కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో  రాచకొండ కృష్ణ, కొంగరి మారయ్య, శంకరయ్య స్వామి, కృష్ణయ్య, లింగస్వామి, రామచంద్రం, ఐలయ్య, నరసింహ, శంకరయ్య  పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T06:06:38+05:30 IST