Advertisement
Advertisement
Abn logo
Advertisement

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

హుజూర్‌నగర్‌  / మేళ్లచెర్వు/ తిరుమలగిరి / తుంగతుర్తి / అర్వపల్లి, డిసెంబరు 2 : భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రోశపతి కోరారు. జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట భవన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో రోశపతి మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని; నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్తఫా, గోపి, అనిల్‌, కిషోర్‌, రామకృష్ణ, సాయి, సైదులు, నరేష్‌, రాంబాబు, వెంకన్న పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సీపీఎం అనుబంధ సంఘాలు, సీఐటియూ ఇతర కార్మికల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వట్టెపు సైదులు, లకావత్‌ బాలాజీ, సీహెచ్‌ రామకృష్ణ, ధీరావత్‌ శ్రీను, ఇమాంసాహెబ్‌, నాగుల్‌ పాల్గొన్నారు. తిరుమలగిరి, తుంగతుర్తిలలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర శ్రీనివాస్‌, ఓరుగంటి అంతయ్య, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు చిర్రబోయిన హన్మంతు, మల్లెపాక నగేష్‌, రమేష్‌, ఎనుగుల గణేష్‌, కడవ లింగయ్య, వేల్పుల పరుశరాములు పాల్గొన్నారు. అర్వపల్లిలో సంఘం అధ్యక్షుడు జహంగీర్‌, నాగయ్య, లింగయ్య, సైదులు, అర్వపల్లి, శ్రీనివాస్‌, వీరే్‌షయాదవ్‌, దుర్గాసాగర్‌, ప్రసాద్‌, సురేష్‌, అంజయ్య, రాజు, పుల్లయ్య, పరుశరాములు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement