Abn logo
Sep 25 2021 @ 01:07AM

ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- వకీల్‌పల్లి గని పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, నాయకులు 

యైటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 24: దేశ, రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం బొగ్గును వెలికితీసే వకీల్‌పల్లె గని మైనింగ్‌ ప్రక్రియకు వ్యతిరేకం కాదని, ప్రభావిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ప్రజలు అభిప్రాయపడ్డా రు. అయితే ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ప్రభావిత ప్రాంతాల సమస్యలు, నిర్వాసిత ప్రజల కష్టాలను పరిష్కరిస్తూ మౌళిక సదుపా యాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్య త ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లె భూగర్భ గని పర్యావరణ ఉల్లంఘ న కేటగిరీ కింద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను శుక్రవారం స్థాని క కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించింది. పెద్దపల్లి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధ్యక్షతన జరిగిన సభలో కాలుష్య నియంత్రణా మండ లి రామగుండం ప్రాంతీయ ఇంజనీర్‌ రవిదాస్‌ సభను నిర్వహించారు. వకీల్‌పల్లె గని ఉత్పత్తి సామర్థ్యం కన్నా అధికంగా బొగ్గు ఉత్పత్తి చేయ డంతో కేంద్ర బొగ్గు, అటవీ పర్యావరణ మార్పు శాఖల ఆదేశాల మేరకు ప్రజాబిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్టు రవిదాస్‌ తెలిపారు. ఆర్జీ-2 జీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గనికి సంబంధించిన వివరాలను, అ వసరాలను, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలియజే శారు. అనంతరం ప్రభావిత గ్రామాలు వకీల్‌పల్లె, వెంకట్రావ్‌పల్లె, జల్లా రం, దుబ్బపల్లె, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ఎన్‌జీఓ సంస్థలు, కాలనీకి చెందిన కార్పొరేటర్‌లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడా రు. అందరూ వాయు కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానికులకు సింగరేణి కాంట్రాక్టు పనుల్లో, ఓబీ కంపెనీల్లో ఉపాధి కల్పించాలని, డీఎఫ్‌ఐడీతో పాటు సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ప్రభా విత గ్రామాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సక్రమంగా పని చేయడం లేదని పలువు రు విమర్శించారు. సింగరేణి ద్వారా ఈప్రాంత అభివృద్ధి జరిగిందని, ని ర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని, సంస్థ చే యగలిగే చిన్నచిన్న పనులు చేయడం లేదని పేర్కొన్నారు.