Abn logo
Sep 25 2021 @ 01:03AM

స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వామపక్ష నాయకులు

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబరు 24: స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలం టూ శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు కడారి సునీల్‌, ఎరవెల్లి ముత్యంరావు, ఈదునూరి నరేష్‌ జీ జ్యోతి మాట్లాడుతూ వివిధ రంగాల్లో పని చేస్తున్న స్రీం వర్కర్ల కనీస వేతనాలు, ఏలాంటి చట్టబద్ధత హక్కులు అమలు కావడం లేదని విరించారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పఽథకాలు, పౌష్టికాహారం, వైద్యం, విద్య అందిస్తున్న తదితర సేవల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లను ఎత్తివేయాలనే ఆలోచనతో కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. బడ్జెట్లలో కోతలు పెడుతూ భారం రాష్ట్ర ప్రభుత్వాలపై వేయ నుందన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో తోకల రమేష్‌, శనిగల శ్రీనివాస్‌, సేనీత, సరిత, లత, రాజేశ్వరి, జ్యోతి, కల్వల పద్మ తదితరులు పాల్గొన్నారు.