కేసుల పురోగతిని వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-16T06:16:49+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానం తో పెండింగ్‌ కేసుల పురోగతిని వేగవంతం చేయా లని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అ న్నారు.

కేసుల పురోగతిని వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

- ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ 


వనపర్తి క్రైమ్‌, మార్చి 15: సాంకేతిక పరిజ్ఞానం తో పెండింగ్‌ కేసుల పురోగతిని వేగవంతం చేయా లని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అ న్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లా డుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారా నికి పోలీసు అధికారులందరూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, గుట్కా, మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటుచేసి చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు అందించాలని సూచించారు. మద్యం తాగి వాహనా లు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. గ్రామాల్లో విలేజీ పోలీస్‌ ఆఫీ సర్లు పర్యటించి ప్రజలకు సీసీ కెమెరాల గురించి అ వగాహన, సైబర్‌ నేరాలపై అప్రమత్తత, ట్రాఫిక్‌ ని బంధనలపై సూచనలు, బాల్య వివాహాలు, బాలకా ర్మిక వ్యవస్థ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐలు ప్రవీణ్‌కుమార్‌, రత్నం, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై రామన్‌గౌడ్‌, పట్టణ ఎస్సై యుగంధర్‌రెడ్డి, రూరల్‌ ఎస్సై చంద్రమోహన్‌, జిల్లా లోని ఎస్సైలు, డీసీఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T06:16:49+05:30 IST