సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకే దిక్కులేదు

ABN , First Publish Date - 2022-07-29T04:41:23+05:30 IST

గ్రామ సేవకులకు అసెంబ్లీ సాక్షిగా సీ ఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమ లుకు దిక్కులేదంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు ఇట్టే అర్థం చేసుకోవా లని మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నా రెడ్డి వ్యంగ్యంగా పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకే దిక్కులేదు
కొత్తకోటలో వీఆర్‌ఏ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

- వీఆర్‌ఏల నిరసన దీక్షలో మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి


కొత్తకోట, జూలై 28: గ్రామ సేవకులకు అసెంబ్లీ సాక్షిగా సీ ఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమ లుకు దిక్కులేదంటే రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు ఇట్టే అర్థం చేసుకోవా లని మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నా రెడ్డి వ్యంగ్యంగా పేర్కొన్నారు. గురువారం కొత్తకోట తహసీల్దార్‌ కార్యాలయం ముందు నాల్గవరోజు గ్రామ సేవకులు నిర్వహి స్తున్న నిరసన కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని, ప్ర సంగించారు. రెవెన్యూ వ్యవస్థకు ఊతకర్రలాంటి గ్రామసేవకులు సమ్మెకు దిగితే అధికార యం త్రాంగానికి సమాచారం ఎక్కడినుంచి వస్తోందని ప్రశ్నించారు. వీఆర్‌ఏల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, కాం గ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ నాయకులు ప్రశాంత్‌, గొల్ల బాబు, బోయోజ్‌, కృష్ణారెడ్డి, మేస్త్రీశ్రీను, సర్పం చులు శేఖర్‌రెడ్డి, శివరాములు, విశ్వనాథం, నరేం దర్‌రెడ్డి, భరత్‌భూషణ్‌, సంతోష్‌రెడ్డి, రాజమౌళి, మాసన్న సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ నాయకులు, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రాములు, కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

- పెబ్బేరు : తహసీల్దార్‌  కార్యాలయం ముందు దీక్ష చేస్తున్న వీఆర్‌లకు కాంగ్రెస్‌ నాయ కులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎద్దుల విజయ వర్దన్‌రెడ్డి మాట్లాడారు. దీక్షలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు వెంకటేష్‌సాగర్‌, సురేందర్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గంధం రంజిత్‌కుమార్‌, యూత్‌ ఎస్సీ సెల్‌ కోశాధికారి సర్వేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ రణధీర్‌రెడ్డి, జహంగీర్‌, పి.అనిల్‌, వీఆర్‌ఏల జేఏసీ చైర్మన్‌ రాజశేఖర్‌, కన్వీనర్‌ భీమేష్‌రెడ్డి, గోవిందమ్మ, ఉస్మాన్‌ తదితరు లున్నారు.

- పాన్‌గల్‌ : తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మె గురువారం నాల్గవ రోజు కొనసాగింది. సమ్మెకు డడకాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మద్ద తు ప్రకటించారు. సమ్మెలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు సురేష్‌, వీఆర్‌ఏలు రామకృష్ణ, నాగరాజు, అగ్గరయ్య, రాజు, అరుణ, రజిత, సునీత, వినోద తదితరులున్నారు.

- ఆత్మకూర్‌ : నాలుగో రోజు దీక్షలో భాగం గా తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి తమ నిర సనను తెలిపారు. గ్రామ సేవకుల మండల అధ్య క్షుడు గోవిందు, శ్రీనివాసులు, వెంకటన్న, పావని తో పాటు, ఆయా గ్రామాల వీఆర్‌ఏలు పాల్గొన్నారు.  

- అమరచింత : వీఆర్‌ఏల సమ్మెకు గురువారం కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అహ్మద్‌, పట్టణ అధ్య క్షుడు అరుణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ కిసాన్‌ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌యాదవ్‌, నాయకులు మ హేందర్‌రెడ్డి, శ్యామ్‌, అయూబ్‌, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.  

- శ్రీరంగాపురం : తహసీల్‌ ముందు వీఆర్‌ ఏలు చేపట్టిన సమ్మెకు గురువారం జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ సంఘీభావం తెలిపి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఎల్లస్వామియాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు రాములుయాదవ్‌, శ్రీహరి, రాజు, గంగాధర్‌యా దవ్‌, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-29T04:41:23+05:30 IST