బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2020-12-05T04:57:39+05:30 IST

సమాజంలో బాలల హక్కులను ప రిరక్షించే బాధ్యత తల్లితండ్రులతో పాటు, మన అందరిపై ఉందని రా ష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెళ్ల దేవయ్య అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
మాట్లాడుతున్న కమిషన్‌ సభ్యుడు దేవయ్య

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెళ్ల దేవయ్య 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 4: సమాజంలో బాలల హక్కులను ప రిరక్షించే బాధ్యత తల్లితండ్రులతో పాటు, మన అందరిపై ఉందని రా ష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెళ్ల దేవయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఏ హాల్‌లో మహిళా శిశుసం క్షేమ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపులు, బాల్య వి వాహాలు జరగకుండా చూడాలని, పిల్లల హక్కులకు ఎవరైనా ఆటం కం కలిగిస్తే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. బాల్య వివాహాలు, పిల్లలపై వేధింపులు లాంటివి గుర్తించినప్పుడు అన్ని శాఖలు ఒకరికొకరు సమన్వయం చేసుకుని పిల్లల హక్కులను కాపాడాలని, 1098 నెంబర్‌కి ఫోన్‌ ద్వారా ఏదైనా సమాచారం అందించాలనుకుంటే, వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని అ న్నారు. కొవిడ్‌ కన్న ముందు, తర్వాతి పరిస్థితులపై సమీక్షించి అందిస్తున్న వివిధ సంక్షేమ, సహకారాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పే ద వారికి నిత్యావసర సరుకులను అందించాలని, వైద్య, విద్యా సౌకర్యా ల కల్పనలు, అవకాశాల గురించి తెలియజేయాలన్నారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం, మినీ అంగన్వాడీ సౌకర్యం, కల్పించాలని సూచించారు. వలస కూలీలకు ఇతర కొన్ని రకాల కులస్థులు, కుటుంబాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అ ని, ఆ దిశగా ధృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో చివరగా పిల్ల ల హక్కులకు సంబంధించిన గోడప్రతులు, పిల్లల చట్టాల పుస్తకాలను ఆవిస్కరించారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్‌ను కాపా డే బాధ్యత అందరిపై ఉందన్నారు. గౌరవ కమిషన్‌ సభ్యుల సూచనల ను తూచ తప్పకుండా పాటించేలా చర్యలు చేపడుతామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే స్తున్నామని తెలిపారు. 

జిల్లా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అంతేకాకుండా చిన్నపిల్లలతో పని చేయిస్తున్నారని, అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ, మహిళా శిశు సం క్షేమ శాఖ అధికారి సురేష్‌, డీఎస్పీ వెంకట రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ అధికారి శ్రీధర్‌తో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-05T04:57:39+05:30 IST