జిల్లాను ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2021-07-23T06:01:21+05:30 IST

మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ ర్షాలు కురియడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.

జిల్లాను ముంచెత్తిన వర్షం
ఆసిఫాబాద్‌లోని పైకాజీనగర్‌లో నీటిలోనుంచి తాళ్లతో కారును లాగుతున్న ప్రజలు

- జోరుగా వానలు 

- జనజీవనం అతలాకుతలం

- ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు 

- రాకపోకలకు అంతరాయం

- ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు

- కుమరం భీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత

ఆసిఫాబాద్‌, జూలై 22: మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ ర్షాలు కురియడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. జిల్లాలో కురుస్తు న్న భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా జిల్లాకు సరిహద్దున ఉన్న పెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై పరివాహక గ్రామాల ప్రజలకు హెచ్చరికలను జారీచేశారు.కుమరం భీం, వట్టివాగు, ఎర్రవాగు(పీపీరావు), చెలిమెల వాగు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టుల్లో భారీగా వరద వచ్చి చేరుతోంది. అధికారులు కుమరం భీం, వట్టివాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి, వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక మండలాలైన ఆసిఫాబాద్‌, వాంకిడి, రెబ్బెన, కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికలపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలను జారీచేశారు. ఆసిఫాబాద్‌ మండలంలో పెద్దవాగు, గుడెన్‌ఘాట్‌, గుండివాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంలో పలుకాల నీలు జలదిగ్భందమయ్యాయి. పట్టణంలోని పైకా జీనగర్‌, కంఠకాలనీ, హడ్కోకాలనీలలో వరద నీరుతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి, దుకా ణాలలోకి వరదనీరు వచ్చి చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురికాగా ఆయా దుకాణాలలోని సామగ్రి నీటమునిగి తడిసి ముద్దయ్యాయి. ముంపు కాలనీలను జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి పరిశీ లించారు. అయా కాలనీలలో నిలిచిన వరదనీటిని తొలగించేం దుకు పంచాయతీ అధికారులు చర్యలను చేపట్టారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌: మండల కేంద్రం తోపాటు గ్రామాల్లో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. బూర్గుడ, బూర్గుడ గ్రామ పంచాయతీలోని బీసీకా లనీలో జాతీయ రహదారిపై నుంచి నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది. దాదాపు పది ఇళ్లు నీటితో నిండాయి. కొంతమంది నిత్యా వసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి బీసీ కాలనీని సందర్శించి స్వయంగా సమస్యలను గుర్తిం చారు. తాత్కాలికంగా అడ్డుగా ఉన్న చోట్ల గండ్లుకొట్టి నీటిని దిగువప్రాంతానికి తరలిం చాలని ఎంపీవో ప్రసాద్‌కు సూచించారు.

బెజ్జూరు: మండలంలో వాగులు ఉప్పొం గడంతో వాగుఅవతల ఉన్న కుశ్నపల్లి, సుస్మీ ర్‌, సోమిని, పాతసోమిని, నాగెపల్లి, ఇప్పల గూడెం, బండలగూడ, చింతలపల్లి, పాతమొ గవెల్లి, పాతసోమిని,చిన్న సిద్దా పూర్‌, పెద్ద సిద్దాపూర్‌ గ్రామాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలుతెగి పోయాయి. సలుగుపల్లి, సులుగుపల్లి గ్రామాల మధ్య తీగల ఒర్రెఉధృతి కారణంగా పెంచికలపేట మీదుగావచ్చే ఆర్టీసీబస్సులు నిలిచి పోవ డంతోప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

దహెగాం: మండలకేంద్రంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. గ్రామాలను తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

లింగాపూర్‌: మండలంలో పిట్టగూడ- జైనూరు ప్రధాన రహదారిపై వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సీఐహనోక్‌, ఎస్సై మధుకర్‌, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో ప్రసాద్‌, ఆర్‌ఐశీల వాగువద్ద ఉండి ప్రజ లను అప్రమత్తం చేశారు. 

చింతలమానేపల్లి: మండలంలోని దిందా- కేతిని, గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రెబ్బెన: మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ నగర్‌ రహదారితో పాటు ఇళ్ల చుట్టు నీరు నిలిచింది. రోడ్లపై రెండు అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. నంబాల బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. 

పెంచికలపేట: వర్షాలకారణంగా ఎర్ర గుంట, మేరేగూడ గ్రామ స్తులు గ్రామం దాటి బయటకిరాలేని పరిస్థితులు నెలకొ న్నాయి. పంటపొలాల్లో నీరుచేరి పంటలు నీట మునిగాయి. పెద్దవాగు, బొక్కివాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను తహసీల్దార్‌ అనంతరాజ్‌, ఎస్సై రమేష్‌ పరిశీలించారు.

కెరమెరి: ఉమ్రివాగు ఉప్పొంగడంతో పరందోళి, మొలగూడ, మహారాజ్‌గూడ, కోట, లక్ష్మిపూర్‌ గ్రామాలకు మండల కేంద్రానికి రాక పోకలు నిలిచిపోయాయి.  

తిర్యాణి :మండలంలో ఎక్కడికక్కడ రవాణా స్తంభించి పోయింది. చాలా చోట్ల పత్తిపంట నీటమునిగి రెవెన్యూ పంచాయతీ అధికారులు ఇళ్లలోకి నీరుచేరినప్రాంతాలను సందర్శిస్తూ తగినచర్యలు చేపడు తున్నారు. 

సిర్పూర్‌(టి): గురువారం లక్ష్మిపూర్‌ వాగులో 33/11 కేవీవిద్యుత్‌లైన్‌ కొట్టుకు పోయింది. వాగులు ఉధృతంగా ప్రవహి స్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తహసీల్దార్‌ నదీములా ్లఖాన్‌ పేర్కొన్నారు. మండలంలోని పంచా యతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు స్థానికంగా ఉండాలన్నారు. పెన్‌గంగా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల న్నారు. 

కౌటాల: సిర్పూర్‌(టి), కౌటాలమధ్యలో విద్యుత్‌స్తంభాలు పడిపోవడంతో కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అందకారంలో మగ్గిపోయాయి. మండల కేంద్రంలో కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని రాస్పెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో గెర్రెగూడ, మన్నెగూడ ప్రజలు ఇబ్బం దులకు గురయ్యారు. పంట చేనులలోకి వరదనీరు చేరడంతో నీట మునిగాయి. అదే విధంగా రాస్పెల్లి గ్రామంలోని మామిడి గూడ కాలనీల్లోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. తహసీల్దార్‌ ప్రమోద్‌, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, సర్పంచ్‌ బొమ్మెళ్ల పద్మ పరిశీలించారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు వచ్చిచేరింది.రెవెన్యూ అధికారులు ముంద స్తుగా స్పందించి చేపలు పట్టేవారు వాగులోకి పోకుండా చర్యలు తీసుకున్నారు. వాగుల వద్దకు ఎవరూ పోరాదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయాగ్రామాల వారికి సూచించారు. పెద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో చిత్రు ఒక ప్రకటనలో కోరారు. 

సిర్పూర్‌(యూ): మండలంలోని వాగులు, వంకలు ఉపొంగి ప్రవహి స్తున్నాయి. పంటపొలాల్లో వర్షపు నీరు చేర డంతో పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆదోళన చెందుతున్నారు.

Updated Date - 2021-07-23T06:01:21+05:30 IST