Abn logo
Sep 22 2021 @ 00:00AM

ఇది అరుదైన పువ్వు!

ఈ పువ్వు పేరు మిడిల్‌మిస్ట్‌ రెడ్‌. వాడుకభాషలో స్ర్పింగ్‌ రోజ్‌ అని పిలుస్తారు. ఈ పువ్వు ప్రత్యేకత ఏంటో తెలుసా? 


  1. ప్రపంచంలో అత్యంత అరుదైన పువ్వు ఇది. ఎందుకంటే రెండు చోట్ల మాత్రమే ఈ మొక్క కనిపిస్తుంది. ఒకటి న్యూజీలాండ్‌లో, రెండోది బ్రిటన్‌లో! 
  2. ఈ మొక్కని జాన్‌ మిడిల్‌మిస్ట్‌ అనే వ్యక్తి 1804లో చైనా నుంచి బ్రిటన్‌కు పట్టుకొచ్చాడు. ఇంగ్లండ్‌లోకి చిస్‌విక్‌ హౌజ్‌ అండ్‌ గార్డెన్స్‌లో ఈ పూలు కనువిందు చేస్తాయి.
  3. తరువాత కాలంలో ఈ మొక్క చైనాలో కనుమరుగైంది. తరువాత న్యూజీలాండ్‌లో కనిపించింది. న్యూజీలాండ్‌లో రెండు శతాబ్దాల పాటు ఈ మొక్క జీవించి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. న్యూజీలాండ్‌లో వైటంగీలోని ట్రీటీ హౌజ్‌లో ఈ మొక్కను చూడొచ్చు. 
  4. బ్రిటన్‌లోని చిస్‌విక్‌ హౌజ్‌ అండ్‌ గార్డెన్స్‌లోనూ, న్యూజీలాండ్‌లోని ట్రీటీ హౌజ్‌లో మాత్రమే ఈ మొక్క కనిపిస్తుంది. అయితే కొంతకాలం క్రితం చిస్‌విక్‌ హౌజ్‌ అండ్‌ గార్డెన్స్‌ నుంచి రియాద్‌లోని స్కై గార్డెన్స్‌లో నాటేందుకు సౌదీ ఆరేబియాకు అందజేశారు.  

ప్రత్యేకం మరిన్ని...