Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడిని ఆటోలో ఊరికి దూరంగా తీసుకెళ్లి సజీవంగా కాల్చేసిన ప్రేయసి.. ఈ దారుణానికి ఎందుకు తెగించిందంటే..

ప్రేమ మొదలైన కొత్తలో ప్రియుడు, ప్రియురాలు.. ఇద్దరికీ కొత్తగా ఉంటుంది. ఆ సంబంధం సక్రమమైనా, అక్రమమైనా.. కొన్నాళ్ల వరకు ఏ ఆటంకం లేకుండా సాగిపోతుంటుంది. అయితే అక్రమ సంబంధాల్లో మాత్రం ఏదో రోజు ఖచ్చింతంగా మొదటికే మోసం జరుగుతుంది. ఈ విషయం తెలీక చాలా మంది క్షణకాల సుఖం కోసం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఇలాగే ఓ అక్రమ సంబంధం, చివరకు ఓ వ్యక్తి జీవితాన్ని బూడిద చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌ ఫరీదాబాద్‌లో ఓ మహిళ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఈమె భర్త చనిపోవడంతో ఆ ఉద్యోగం భార్యకు వచ్చింది. ఈమె ఇద్దరు కుమార్తెలు పంజాబ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో మహిళ ఒక్కటే ఉంటోంది. ఒంటరితనంతో ఉన్న ఆమెకు, కంపెనీలో పని చేస్తున్న పవన్ అనే వ్యక్తి పరిచయం.. జీవితంపై భరోసా కల్పించింది. దీంతో అతడికి బాగా దగ్గరైంది. ఎంత దగ్గరంటే.. రోజూ ఇంటికొచ్చేంతగా కలిసిపోయారు. ఇలా గుట్టుగా వారి అక్రమ సంబంధాన్ని కొనసాగించసాగారు. కొన్నాళ్లకు పంజాబ్‌లో ఉన్న ఓ కుమార్తె ఇంటికి వచ్చింది. అక్రమ సంబంధానికి అలవాటుపడ్డ పవన్.. మహిళ కుమార్తెపై కూడా కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ వేశాడు.

ప్రతీకాత్మక చిత్రం

ఈ క్రమంలో మహిళ కుమార్తెను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేయసాగాడు. విసిగిపోయిన ఆమె.. తల్లికి విషయం తెలియజేసింది. తన కూతురిని కూడా వక్ర దృష్టితో చూసిన పవన్‌పై కోపం పెంచుకుంది. మంచి పద్ధతి కాదని పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయమై రోజూ గొడవపడేవారు. రోజులు మారుతున్నా అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో అతన్ని అంతమొందిచాలని మహిళ నిర్ణయించుకుంది. పైకి కోపం పోయినట్లు నటించేది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన ఇంటికి రమ్మని పిలిచింది. ఇంటికి వచ్చిన పవన్‌తో సరసంగా మాట్లాడి, నమ్మించింది. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నిద్రమాత్రలను అన్నంలో కలిపి తినిపించింది. దీంతో అతను నిద్రలోకి జారుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం

తర్వాత అతన్ని ఆటోలో ఊరి బయటకు తీసుకెళ్లింది. నిర్మానుష్య ప్రదేశంలో అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. దీంతో ప్రాణంతో ఉన్న పవన్.. హాహాకారాలు చేస్తూ అక్కడికక్కడే ప్రాణలొదిలాడు. పోలీసులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని గుర్తు పట్టకుండా మార్పులు చేసింది. తర్వాతి రోజు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా పంజాబ్‌కు చెందిన పవన్‌గా గుర్తించారు. ఎట్టకేలకు విషయం తెలుసుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. బండారం బయటపడింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement