కష్టపడితేనే ఫలితం!

ABN , First Publish Date - 2020-10-29T05:48:17+05:30 IST

రామాపురంలో రాజయ్య, రంగయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. కానీ వారి ఇద్దరి దారులు వేరు. రాజయ్య కష్టపడి సంపాదిస్తే రంగయ్య మాత్రం కష్టపడకుండా...

కష్టపడితేనే ఫలితం!

రామాపురంలో రాజయ్య, రంగయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. కానీ వారి ఇద్దరి దారులు వేరు. రాజయ్య కష్టపడి సంపాదిస్తే రంగయ్య మాత్రం కష్టపడకుండా కూర్చొని తినాలని అనుకునేవాడు. రాజయ్య ఊరి చివర ఉన్న పోరంబోకు భూమిని సాగు చేసి ఆకుకూరలు, కూరగాయలు పండించి, వాటిని పట్నంలో అమ్మి డబ్బు సంపాదించుకునే వాడు. రంగయ్య మాత్రం రాజయ్యను చూసి నవ్వుకునే వాడు. ఏనాటికైనా పెద్ద ధనవంతుడిని అవుతానని రంగయ్య కలల్లో బతికేవాడు. ‘‘కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. చిన్న చిన్న ఎలుకలు ఎందుకు?’’ అనుకునే వాడు. అందులో భాగంగా నిధుల వేటలో పడ్డాడు. ఓ బృందాన్ని తయారుచేసుకుని పురాతన దేవాలయాలకు రాత్రుళ్లు వెళ్లి తవ్వించేవాడు. అలా చాలా గుళ్లు తవ్వించాడు. కానీ నిధులేమీ దొరకలేదు. ఖర్చు మాత్రం చాలా అయింది. ఉన్న మూడెకరాల పొలాన్ని అమ్మేసుకుని బికారిగా మారాడు. కష్టాన్ని నమ్ముకున్న రాజయ్య మాత్రం తాను బాగు చేసుకున్న రెండెకరాల భూమికి ప్రభుత్వ పట్టాను సాధించుకున్నాడు. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాడు.


Updated Date - 2020-10-29T05:48:17+05:30 IST