మా ఊరికి బస్సు వచ్చింది

ABN , First Publish Date - 2021-12-03T05:18:49+05:30 IST

తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు చేసిన పోరాటం ఫలించింది.

మా ఊరికి బస్సు వచ్చింది
బస్సు వద్ద ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

- ఫలించిన విద్యార్థుల పోరాటం

గద్వాల క్రైం, డిసెంబరు 2 : తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు చేసిన పోరాటం ఫలించింది. మండలంలోని నాగర్‌దొడ్డికి బస్సు సౌకర్యం కల్పించాలని రెండు రోజుల క్రితం గ్రామస్టేజీ వద్ద, కలెక్టరేట్‌ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. ఇందుకు స్పందించి ఆర్టీసీ అధికారులు గురువారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-12-03T05:18:49+05:30 IST