‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’

ABN , First Publish Date - 2022-01-25T05:28:13+05:30 IST

రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ సూచించారు.

‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’
పత్తికొండలో ప్రతిజ్ఞ

ఆదోని టౌన్‌, జనవరి 24: రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో  సిబ్బందితో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, ఎంఈ సత్యనారాయణ, టీపీవో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. 


ఆలూరు: ఓటు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌ అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్స్‌ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేయించుకోవాలన్నారు.  ఆర్‌ఐ గుండాల నాయక్‌, వీఆర్వోలు, ఖజానా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. 


పత్తికొండటౌన్‌: వయోజనులందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఎంపీడీవో పార్ధసారధి, ఎంపీపీ నారాయణదాసు పేర్కొన్నారు. సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికల్లో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాబుల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T05:28:13+05:30 IST