అధిక ఇన్సులిన్‌తో మధుమేహులకు ముప్పు!

ABN , First Publish Date - 2021-10-15T06:26:34+05:30 IST

మధుమేహంతో బాధపడుతు న్న వారు అధిక మోతాదులో ఇన్సులిన్‌ తీసుకోవడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అధిక ఇన్సులిన్‌తో మధుమేహులకు ముప్పు!

హైదరాబాద్‌, అక్టోబరు 14: మధుమేహంతో బాధపడుతు న్న వారు అధిక మోతాదులో ఇన్సులిన్‌ తీసుకోవడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శరీరం లో సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతింటుందని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎ్‌ఫఆర్‌)కు చెందిన ఉల్లాస్‌ కొల్తూర్‌ బృందం, ఐఐటీ ముంబైకి చెందిన రంజిత్‌ బృందం జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ‘‘రోడ్లపై సిగ్నలింగ్‌ వ్యవస్థ పాడైతే ట్రాఫిక్‌ స్తంభించడంతో పాటు ప్రమాదాలు జరుగుతాయి. శరీరంలో సిగ్నలింగ్‌ వ్యవస్థ పాడైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అధిక మొత్తంలో తీసుకునే ఇన్సులిన్‌ శరీరంలోని కణజాలంతో పాటు కిడ్నీలనూ దెబ్బతీస్తుందనీ, కళ్లు, కండరా లు, నరాల సమస్యలూ తలెత్తుతాయని గతంలోనే గుర్తించారు. అయితే.. శరీరంలో సంకేతాలు పంపే వ్యవస్థ దెబ్బతింటుందని కనుగొనడం ఇదే తొలిసారి. సంకేతాలు పంపే వ్యవస్థ దెబ్బతింటే మందులు కూడా పనిచేయకపోవచ్చు’’ అని టీఐఎ్‌ఫఆర్‌ శాస్త్రవేత్తలు ఉల్లాస్‌ కొల్తూర్‌, సీతారాం తెలిపారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వేగంగా వ్యాపిస్తోంది. 

Updated Date - 2021-10-15T06:26:34+05:30 IST