విద్యాశాఖలో సీఆర్పీల పాత్ర కీలకం : బీబీ పాటిల్‌

ABN , First Publish Date - 2022-01-20T04:30:06+05:30 IST

విద్యాశాఖలో సీఆర్పీల పాత్ర కీలకమని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు.

విద్యాశాఖలో సీఆర్పీల పాత్ర కీలకం : బీబీ పాటిల్‌
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ బీబీ పాటిల్‌

సంగారెడ్డి అర్బన్‌/హత్నూర, జనవరి 19 : విద్యాశాఖలో సీఆర్పీల పాత్ర కీలకమని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. బుధవారం విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ (సీఆర్పీ) యూనియన్‌ నూతన సంవత్సర జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పీఆర్సీ ద్వారా 30 శాతం వేతనాలు పెంచింది తమ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు మరెల్లిదత్తు, ప్రధాన కార్యదర్శి రాజు, సీఆర్పీలు వినయ్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అలాగే హత్నూర మండలంలో తెలంగాణ ప్రజాహక్కుల పరిరక్షణ కమిటీ క్యాలెండర్‌ను బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ వారి హక్కులపై అవగాహన కల్పించాలని సూచించినట్లు తెలంగాణ ప్రజాహక్కుల పరిరక్షణ కమిటీ నర్సాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కొనింటి రాజ్‌కుమార్‌, స్వేరోస్‌ అడ్వకేట్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విజయరాజ్‌, ప్రభాకర్‌, విజయ్‌, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రాజు, జిల్లా కమిటీ సభ్యులు సురేందర్‌, రాములు, మహేష్‌, నర్సాపూర్‌ అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి నగేష్‌, నర్సింలు, సదాశివపేట మండలాధ్యక్షుడు ముత్తంగి వేణు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:30:06+05:30 IST