సంక్షేమ పథకాల అమలులో డిజిటల్‌ అసిస్టెంట్ల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-10-23T04:31:18+05:30 IST

ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయడంలో డిజిటల్‌ అసిస్టెంట్ల పాత్ర కీలకమని ఎంపీడీవో రమేశ్‌నాయుడు అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో డిజిటల్‌ అసిస్టెంట్ల పాత్ర కీలకం
మాట్లాడుతున్న ఎంపీడీవో రమేశ్‌నాయుడు

సబ్బవరం, అక్టోబరు 22 : ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయడంలో డిజిటల్‌ అసిస్టెంట్ల పాత్ర కీలకమని ఎంపీడీవో రమేశ్‌నాయుడు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం డిజిటల్‌ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన అన్ని అర్జీలను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీల్లో అర్హులను గుర్తించాలని, అనర్హులు ఉంటే తిరస్కరించాలన్నారు. కొత్త పింఛన్లను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల సమక్షంలో పంపిణీ చేయాలని చెప్పారు. ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ పరిపాలనాధికారి షేక్‌ బాబూరావు, పలువురు డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T04:31:18+05:30 IST