Abn logo
Jul 24 2021 @ 23:53PM

రాష్ర్టాభివృద్ధిలో కేటీఆర్‌ పాత్ర కీలకం

రావిరాలలో మొక్క నాటుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌ / మహేశ్వరం : రాష్ర్టాభివృద్ధిలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాత్ర కీలకమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపుమేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్‌ గ్రామ పరిధి గున్‌గల్‌-ఆగపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహించారు. ఒక్కరోజే మూడు లక్షల మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 33 శాతంగా అడవుల విస్తీర్ణం ఉండాలనే లక్ష్యంతో హరితహరంలో పెద్ద ఎత్తున మొ క్కలు నాటుతున్నామన్నారు. కేటీఆర్‌ తండ్రికి తగ్గ తనయుడని, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు రాష్ర్టానికి 14 వేల కంపెనీలతో పెట్టుబడులు పెట్టించిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ లక్షా అరవై వేల డిక్షనరీలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గున్‌గల్‌ ఎతైన ప్రాంతం కావడంతో ఇక్కడి వరకు సాగు నీటిని తీసుకువస్తే ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 84 వేల ఎకరాలకు, మహేశ్వరం నియోజకవర్గంలోని 65 వేల ఎకరాలకు నీటిని అందించడానికి వీలుంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆగాపల్లి నుంచి తులేకలాన్‌ వెళ్లే రోడ్డు పనులు ఫారెస్టులో రెండు కిలో మీటర్ల మేరకు ఆగిపోయాయయని వెంటనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఫారెస్ట్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ సునీతాభగవత్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఆర్డీవో వెంకటాచారి, జిల్లా అటవీశాఖ అధికారి జానకీరాం, ఫారెస్టురేంజ్‌ అధికారి విష్టువర్ధన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మల్లేష్‌, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ సత్తయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్‌, నాయకులు మంద సురేష్‌, జెర్కోని రాజు తదితరులు పాల్గొన్నారు.

 పోలీస్‌ నిఘాలో మంత్రి పర్యటన

పోలీసుల నిఘానీడలో మంత్రి సబితారెడ్డి పర్యటన కొనసాగింది. మంత్రి కాన్వాయ్‌ వెళ్లే దారి వెంబడి ఏసీపీ యాదగిరిరెడ్డి అధ్వర్యంలో అన్ని మండలాల సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మూడుకోట్ల మొక్కలు నాటడం అపూర్వ ఘట్టం

మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటడం అపూర్వఘట్టంగా నిలిచిపోతుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండలంతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిరాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రావిరాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవీందర్‌రావు, శ్రీనివా్‌సరావు, సీఐ వీణారెడ్డి, తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, నాయకులు లక్ష్మయ్య, రవినాయక్‌, సామ్యూల్‌రాజు, శ్రీకాంత్‌గౌడ్‌, పాల్గొన్నారు.