Oct 27 2021 @ 03:20AM

వాస్కోడిగామా పాత్ర గుర్తుండిపోతుంది

‘‘పూరి జగన్నాథ్‌, ఆకాష్‌ పని అయిపోయింది’ అని చాలామంది అన్నారు. కానీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో అంతా వెనక్కి వచ్చింది. నేను సక్సెస్‌ కొట్టాలి. మా నాన్న కాలర్‌ ఎగరేయాలి. అది ‘రొమాంటిక్‌’ చిత్రంతో జరుగుతుందని అనుకుంటున్నా’’ అని ఆకాష్‌ పూరి అన్నారు. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆకాష్‌ పూరి పంచుకున్నారు. 


అనిల్‌ గారు నాన్నగారి దగ్గిర సీజీ డిపార్ట్‌మెంట్‌ చూసుకుంటున్నారు. ఒక రోజు నాన్నగారు సడన్‌గా పిలిచి అనిల్‌ దర్శకత్వంలో నువ్వు హీరోగా సినిమా చేయాలన్నారు. ఇద్దరం షాకయ్యాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు వాస్కోడిగామా. చంటిగాడు, బుజ్జిగాడు, పండుగాడు పాత్రల్లా ఇది కూడా ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. మా నాన్న సక్సెస్‌ను నేను ఎంజాయ్‌ చేసినట్టే నా సక్సెస్‌ను మా నాన్న ఎంజాయ్‌ చేయాలనేది నా కోరిక.