తెలుగుభాషపై పాలకులకు గౌరవం లేదు

ABN , First Publish Date - 2021-11-29T05:48:37+05:30 IST

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, పాలకులకు గాని తెలు గు భాష పట్ల ఏ మాత్రం గౌరవం లేదని, దాని అభివృద్ధికి ఎటువంటి కృషి జరగటం లేదని మా జీ ఉప సభాపతి డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ విమర్శించారు.

తెలుగుభాషపై పాలకులకు గౌరవం లేదు
బుద్ధ ప్రసాద్‌ను ఘనంగా సత్కరిస్తున్న నిర్వాహకులు, సాహితీవేత్తలు

మాజీ ఉప సభాపతి బుద్ధప్రసాద్‌


ఒంగోలు(కల్చరల్‌), నవంబరు 28: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, పాలకులకు గాని తెలు గు భాష పట్ల ఏ మాత్రం గౌరవం లేదని, దాని అభివృద్ధికి ఎటువంటి కృషి జరగటం లేదని మా జీ ఉప సభాపతి డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌ విమర్శించారు. ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో జరిగిన కళామిత్ర మండలి వార్షికో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి చిత్రపటానికి పూల మాల సమర్పించారు. అనంతరం నరసం రాష్ట్ర గౌరవాఽధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షతన జరిగిన సభలో బుద్ధప్రసాద్‌ ప్రసంగిస్తూ పాలకుల్లో పర భాష, పర సంస్కృతి వ్యామోహం పెరిగిందన్నా రు. తెలుగుభాష అతి ప్రాచీనమైనదని, సంగీత పరమైనదన్నారు. మన భాష ఔన్యత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. భాషను నిలపెట్టటానికి సాహి త్యాన్ని, రచయితలను ప్రోత్సహించాల్సిన ఆవశ్య కత ఉందన్నారు. అనంతరం ఆయన కళామిత్ర మండలి అధ్యక్షుడు నూనె అంకమ్మరావు రచిం చిన సాహితీమూర్తులు పుస్తకాన్ని ఆవిష్కరించా రు.  డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడు తూ ఈ పుస్తకం పాఠశాల స్థాయిలో విద్యాబో ధనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  అనంతరం నూనె వెంకాయమ్మ, వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారంతో డాక్టర్‌ మ ండలి బుద్ధ ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. పలువురికి సాహితీ ప్రతిభా పురస్కారాలను అం దజేశారు. కె.బాలకోటయ్య ఆధ్వర్యంలో చందు డాన్స్‌ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యా లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. కార్యక్ర మంలో సాహితీవేత్తలు  వీరవల్లి సుబ్బారావు(రు ద్రయ్య), కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధా నకార్యదర్శి జీవీ.పూర్ణచందు, డాక్టర్‌ భూసురప ల్లి వెంకటేశ్వర్లు, పోతుల పెదవీరనారాయణ, కు ర్రా ప్రసాద్‌బాబు, మిడసల మల్లిఖార్జునరావు, తన్నీరు బాలాజీ, సింహాద్రి జ్యోతిర్మయి, కేవీ. ర మణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-29T05:48:37+05:30 IST