అధికార పార్టీ అప్రమత్తం!

ABN , First Publish Date - 2021-06-18T06:24:19+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజే ందర్‌తోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి ని జామాబాద్‌ జిల్లా అధికార పార్టీ నేతలు అప్రమత్తమ య్యారు.

అధికార పార్టీ అప్రమత్తం!

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పార్టీ మార్పుతో దిద్దుబాటు చర్యలు 

ఉమ్మడి జిల్లాలో అసంతృప్తులతో చర్చలు, పదవులపై హామీలు

నిజామాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి ఈటల రాజే ందర్‌తోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి ని జామాబాద్‌ జిల్లా అధికార పార్టీ నేతలు అప్రమత్తమ య్యారు. ఉమ్మడి జిల్లా పరిధి లోని అసంతృప్తులపై దృష్టి సారించారు. మంత్రి, ఎమ్మెల్యే లతో పాటు ఇతర నేతలు వారి తో మాట్లాడుతున్నారు. వారికి భవిష్యత్తులో పార్టీలో మంచి అవ కాశాలు కల్పిస్తామని హామీ ఇస్తు న్నారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగు ణంగా ఎక్కడికక్కడ సెట్‌ చేస్తున్నారు. త మ నియోజక వర్గాలలో ఎవరు కదలకుండా చూసుకుంటున్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలి సి బీజేపీలో చేరారు. తన అనుచరులను కూడా ఒక సభ ద్వారా చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెట్టి నప్పటి నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో  మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తులను పిలిచి మాట్లాడుతున్నారు. వారికి పార్టీతో పాటు నామినేటెడ్‌ పద వులలో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. తమ ప రిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని చెబు తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్‌ నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవుల లో అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం చెప్పిన విధంగా గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. కొంత మందిని హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడి ప ంపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజక వర్గాల పరిధిలో ఇదే రీతిలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్ర యత్నాలు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎ క్కువ మంది వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

దాదాపు అందరికీ పదవులు

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా పరిధి లో ఉన్న కొద్ది మందికి మినహా దాదాపు అందరికీ ఏదో ఒక పదవి వచ్చింది. గ్రామ సర్పంచ్‌ నుంచి జడ్పీటీసీల వరకు అవకాశం ఇచ్చారు. కొద్ది మంది సీనియర్‌ నేతలకు అవకా శం రాలేదు. వారికి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న నామినేటె డ్‌ పదవులతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం కల్పించనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత ల సమాచారం బట్టి తెలుస్తోంది. కొంత మంది నేతలతో బీ జేపీ నేతలు మంతనాలు జరిపినట్లు తెలియడంతో తమ ప రిధిలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. పార్టీ అధికారంలో ఉండ డం వల్ల ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని పార్టీ సీనియర్‌ నేతలు తెలిపారు. మూడేళ్ల వరకు ప దవులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినా.. ఇతర నేతలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

Updated Date - 2021-06-18T06:24:19+05:30 IST