హడావిడి మొదలైంది

ABN , First Publish Date - 2022-09-16T05:17:08+05:30 IST

ముఖ్యమంత్రి కే చంద్రశే ఖర్‌ రావు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ అధికా రిక పర్యటనకు రంగం సిద్ధమవుతోంది.

హడావిడి మొదలైంది
ప్రారంభానికి సిద్ధమైన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌

- ఈ పక్షంలో సీఎం కేసీఆర్‌  పర్యటన

- సర్వహంగులతో సిద్ధమవుతోన్న పాలమూరు కలెక్టరేట్‌

- టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయమూ ప్రారంభం

- నూతన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

- యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు

- ఇంకా ఖరారు కాని తుది షెడ్యూల్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశే ఖర్‌ రావు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ  అధికా రిక పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే పక్షం రోజుల్లో ఎప్పుడైనా సీఎం కేసీఆర్‌ పర్యటన ఉండబోతోందనే సంకేతాలు అధికార వర్గాలకు రా వడంతో అందుకోసం అవసరమైన ఏర్పాట్లు  నిర్వ హిస్తున్నారు. సీఎం పర్యటనలో కొత్తగా నిర్మిత మైన జిల్లా అధికార కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌), టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుప త్రికి శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటు న్న నేపథ్యంలో అధికార వర్గాల్లో హడావిడి మొద లైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వయంగా ఏర్పాట్లపై అధికారులకు సూచనలందిస్తూ, సీఎం పర్యటించే ప్రాంతాలను సందర్శించి లోటుపాట్లను చర్చి స్తుండడంతో సీఎం పర్యటన ఖరారైన ట్లేనని అధికార వర్గాలు బావిస్తున్నా యి. ఎలాంటి లోటులేకుండా సీ ఎం పర్యటన విజయవంతం చే సేందుకు మంత్రితో పాటు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధికారులను అప్రమత్తం చేస్తూ, పెండింగ్‌ పనులు వేగంగా చేయిస్తున్నారు. 

 రూ. 500 కోట్లతో..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఇప్పటికే  మె డికల్‌ కాలేజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, దానికి కొనసాగింపుగా  మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 500 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు.  కొ త్త కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తయి కార్యాల యాలన్నీ అక్కడకు తరలుతుండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే ఈ మ ల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు.  టెండర్‌ దక్కించుకున్న నిర్మాణ సంస్థ  పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో ప్రాథమిక పనులు చేపట్టింది. 

  సీఎం రాక సందర్భంగా భారీ సభకు సన్నాహాలు

 సీఎం పర్యటన దాదాపు ఖరారవడంతో సీఎం పర్యటన రోజు మహబూబ్‌నగర్‌ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తలపెట్టారు. సీఎం పాల్గొనే ఈ సభను పట్టణంలోని ఎంవీఎస్‌ కాలేజీ మైదానంలో గానీ, పాల్కొండ సమీపంలో గానీ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలను మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వే డి రగులుకోవడం, పాలమూరులో  ప్రత్యేకించి మహబూ బ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రాజకీయంగా నిత్యం ప్రాధాన్యం ఉంటుండడంతో సభను సక్సెస్‌ చేయడం ద్వారా తమ సత్తా చాటాలని మంత్రి పార్టీ శ్రేణులకు సూచనలి స్తున్నారు. మొత్తంగా సీఎం పర్యటన విజయవంతం చేసేం దుకు మంత్రి, అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో అధికార వర్గాల్లో, ఉద్యోగుల్లో హడావిడి కొనసాగుతోంది.

 రూ.55 కోట్లతో నిర్మించిన  నూతన కలెక్టరేట్‌ సముదాయం

 మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలకొండ సమీపంలో భూత్పూర్‌ రోడ్డు పక్కన ఆధునిక హంగులతో  నూతన కలెక్టరేట్‌ (జిల్లా కార్యాలయాల సముదాయం) భవనం ప్రారంభానికి సిద్ధమైంది. హెలీప్యాడ్‌ సహా ఆడిటోరియం, 32 శాఖల కార్యాల యాలుండేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన సముదా యం కోసం ఇక్కడ 22 ఎకరాల స్థలాన్ని గుర్తించగా, అందులో దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో సముదాయాన్ని నిర్మించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ కాంప్లెక్స్‌ చు ట్టూ ప్రహరీని నిర్మించారు. ప్రహరీలోపల గార్డెన్స్‌, లాన్‌, ప్రత్యేక పార్కింగు సదుపా యాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని  32 శాఖల కార్యాలయా లు ఒకేచోట ఏర్పాటు చేసేందుకు ఈ కాంప్లెక్స్‌తో సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ భవనంలో మిగిలిన అంతర్గత పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ భవనం ప్రారంభంతో పాటు జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్‌ ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని కూడా అదే రోజు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 



Updated Date - 2022-09-16T05:17:08+05:30 IST