Abn logo
Aug 15 2020 @ 04:45AM

వీరుల త్యాగఫలం

నేడు స్వాతంత్య్ర దినోత్సవం

దేశభక్తికి ప్రతీక మువ్వన్నెల జెండా

కరోనాతో సాదాసీదాగా వేడుకలు

కలెక్టరేట్‌లో జెండావిష్కరించనున్న ప్రభుత్వ విప్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌/దండేపల్లి: ఎందరో వీరుల త్యాగఫలంతో దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. దేశ వ్యాప్తంగా శని వారం జెండా పండుగను ప్రజలు వేడుకగా జరుపుకో నున్నారు. కార్యాలయాలు, కూడళ్ళ వద్ద జాతీయ  జెండాలను ఎగురవేసి సంబరాలు జరుపుకోనున్నారు.  కుల, మత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలంద రూ పంద్రాగస్టును జరుపుకోనున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో జెండా పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.         


చిరస్మరణీయమైన రోజు 

దేశ చరిత్రలో పంద్రాగస్టు చిరస్మరణీయమైన రోజు. దేశాన్ని బ్రిటిష్‌ వారు ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దపు చివరకు తమ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్దపు తొలినాటి వరకు వారి ఆధిపత్యం పూర్తిగా స్థిర పడి పోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌ ములుగా మొఘల్‌ పరిపాలకులే ఉన్నా 19 శతాబ్ది తొలినాళ్ల నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగి భారత సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మిబాయి, తాంతియా తోపే, బహదూర్‌ షా జాఫర్‌, నానా సాహెబ్‌లు పోరాడారు.


1858లో బ్రిటిష్‌ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశంలో బ్రిటిష్‌ పాలన జరిగింది. దేశానికి  స్వాతంత్య్రం సిద్ధించేందుకు ఎందరో వీరులు పలు మార్గాల్లో అనేక పోరాటాలు చేశారు.  భారత దేశానికి స్వాతంత్య్ర పోరాటంలో  సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలు మహాత్మాగాంధీ నడిపించారు. ఎందరో వీరుల త్యాగా లతో స్వాతంత్య్రం సిద్ధించింది.   


జెండావిష్కరించనున్న ప్రభుత్వ విప్‌ 

కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కలెక్టర్‌ భారతి హొళికేరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరపనున్నట్లు కలెక్టర్‌ ఒకప్రకటనలో తెలిపారు.  


స్వాతంత్య్ర వేడుకలకుకరోనా అడ్డంకి..

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హం గు, ఆర్భాటాలు లేకుండా స్వాతంత్య్ర వేడుకలు జరు పుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదాసీదాగా వేడుకలు జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.   శానిటైజర్లు, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అధికారులు వందన సమర్పణ చేయాలి. ఈ వేడుకలలో పాల్గొనే వారంతా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ భారతి హొళికేరి ఉత్త ర్వులు జారీ చేశారు.


యేటా మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల పరేడ్‌ గ్రౌండ్‌లో  వైభవంగా వేడుకలు జరిగేవి. పాఠశాలల విద్యార్థుల ఆటాపాటలు, పోలీసుల కవాతులు, రంగురంగుల డిజైన్లతో అలంకరించే మైదానం కరోనా కారణంగా బోసి పోనుంది.  స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దుకాణాల లో జాతీయ జెండాలు, పుష్పాలు, ప్రతిమలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు విక్రయాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు.. 

Advertisement
Advertisement