సైనికుల త్యాగం అజరామరం

ABN , First Publish Date - 2021-01-16T06:31:36+05:30 IST

సైనికుల త్యాగం అజరామరమని పలువురు కొనియాడారు. భారతీయ సైనిక దినోత్సవాన్ని శుక్రవారం భువనగిరిలో ఘనంగా నిర్వహించారు.

సైనికుల త్యాగం అజరామరం
భువనగిరిలో ఆర్మీడే ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు

భువనగిరి టౌన్‌, జనవరి 15: సైనికుల త్యాగం అజరామరమని పలువురు కొనియాడారు. భారతీయ సైనిక దినోత్సవాన్ని శుక్రవారం భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి శ్రీదేవి, లెక్చరర్స్‌, శ్రీమోహన్‌, అవిదర్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే విశ్రాంత సైనికులు పోలి శంకర్‌రెడ్డి, బీఎన్‌ లక్ష్మీనారాయణ, కొత్త లక్ష్మయ్య, అంజయ్య, తదితరులను పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌,  కౌన్సిలర్‌ శ్రీవాణి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు రాంచంద్రయ్య, బర్రె నరేష్‌, రఫీయోద్దీన్‌, మాచర్ల వినయ్‌, ఫయాజ్‌, కొత్త బాలకృష్ణ, గంగినేని హరియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికులను సత్కరించి అభినందించారు. క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు యంపల్లి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

 రాజాపేట: రాజాపేటల మండలంలోని రాజాపేట, రఘునాథపురం గ్రామాల్లో ఆర్మీడేను నిర్వహించారు. రాజాపేట గ్రామానికి చెందిన ఆర్మీ జనవాన్లను ఘనంగా సన్మానించారు. దేశ కోసం జవాన్లు అహర్నిశలూ శ్రమిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, ఈశ్వరమ్మ శ్రీశైలం, దాచెపల్లి రాజు, సంపత్‌, వెంకట్‌, రాజేశ్వర్‌గుప్త, బాబు, లక్ష్మణ్‌, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

తుర్కపల్లి(బొమ్మలరామారం):  మండలంలోని మర్యాల గ్రామంలో బీజేపీ నాయకులు బీఎ్‌సఎఫ్‌ బెటాలియన్‌ సైనికులను శాలువాలతో కప్పి సన్మానించారు. కార్యక్రమంలో నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీర్‌ రాజేందర్‌రెడ్డి, నాయకులు పాములపర్తి నరేశ్‌, నరేందర్‌నాయక్‌, తిరుమల్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-01-16T06:31:36+05:30 IST