పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-10-24T05:13:26+05:30 IST

దేశ రక్షణ కోసం సైనికులు, పోలీ సులు త్యాగాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారని, వారి సేవలు మరువలేనివని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. వాల్తేరు గ్రామానికి చెందిన పి.కృష్ణమూర్తి 2000 సంవత్సరంలో మందస మండలం హరిపురంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ నక్సల్స్‌ దాడిలో మృతి చెందారని, ఆయన మృతి బాధాకరమన్నారు. ఆయన స్మారక స్థూపం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
కృష్ణమూర్తి స్మారక స్థూపం వద్ద సెల్యూట్‌ చేస్తున్న డీఎస్పీ శ్రావణి

సంతకవిటి, అక్టోబరు 23: దేశ  రక్షణ కోసం సైనికులు, పోలీ సులు త్యాగాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారని, వారి సేవలు మరువలేనివని  పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు.  వాల్తేరు గ్రామానికి చెందిన పి.కృష్ణమూర్తి 2000 సంవత్సరంలో మందస మండలం హరిపురంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ నక్సల్స్‌ దాడిలో మృతి చెందారని, ఆయన మృతి బాధాకరమన్నారు. ఆయన స్మారక స్థూపం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాజాం రూరల్‌ సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ జనార్దనరావు, గ్రామపెద్దలు గురుగుబెల్లి స్వామి నాయుడు, గవరయ్య తదితరులు పాల్గొన్నారు. 


టెక్కలిలో...

టెక్కలి రూరల్‌: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.


నందిగాంలో...

నందిగాం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం నందిగాంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కాశీబుగ్గ రూరల్‌ సీఐ డి.రాము, ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు,  పంచాయతీ కార్యదర్శి పి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-10-24T05:13:26+05:30 IST