అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-10-22T04:42:57+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
స్మృతి స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న క లెక్టర్‌ సూర్యకుమారి, ఎస్పీ దీపికాపాటిల్‌

కలెక్టర్‌ సూర్యకుమారి

విజయనగరం క్రైం, అక్టోబరు 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్మృతి స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సమాజ భద్రత, సామరస్యానికి, శాంతికి పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే నేడు మనం సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని చెప్పారు. అమరులైన పోలీసు కుటుంబాలకు మనమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ దీపికాపాటిల్‌ మాట్లాడుతూ ధైర్యసాహసాలతో మావోయిస్టులను ఎదుర్కొంటూ ఐదుగురు జిల్లా పోలీసులు అమరులయ్యారన్నారు. కరోనా నివారణ విధుల్లో ఫ్రంట్‌లైన వారియర్లుగా ముందు వరుసలో నిలబడి ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అనంతరం అమరవీరులు ముద్దాడ గాంధీ సతీమణి, మనోరంజని, ఇస్మాయిల్‌ సతీమణి బాబీజాన, శ్రీరాములు సతీమణి ప్రమీల, సూర్యనారాయణ సతీమణి రాజు, చిరంజీవి సతీమణి విశాలక్షితో పోలీసు కార్యాలయంలో కొద్దిసేపు మాట్లాడారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఏ సమస్య ఉన్నా తనని నేరుగా కలవచ్చునని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ సత్యనారాయణరావు, శ్రీదేవిరావు, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, డీఎస్పీలు అనిల్‌కుమార్‌, సుభాష్‌, ఎల్‌.మోహనరావు, త్రినాథ్‌, ఆర్‌. శ్రీనివాసరావు, శేషాద్రి, ఏఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T04:42:57+05:30 IST