అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-10-22T06:23:36+05:30 IST

విధి నిర్వహణలో పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ అన్నారు.

అమరవీరుల త్యాగాలు మరువలేనివి
అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌

వనపర్తి క్రైమ్‌, అక్టోబరు 21: విధి నిర్వహణలో పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ అన్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించిన ఫ్లాగ్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరులైన పోలీసు కుటుంబ సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి రెండు  నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబరు 21వ తేదీన సీఆర్‌పీఎఫ్‌ ఎస్సై కరమ్‌సింగ్‌ నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడక్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వీరి ప్రాణత్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబరు 21న పోలీస్‌ ఫ్లాగ్‌ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు, ఆర్మీ శాఖలకు చెందిన 377 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం వీరమరణం పొందారని అన్నారు. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబా లకు  ఆర్థికపరమైన ప్రయోజనాలను అందజేయడం, మానసిక బలా న్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే వి ధంగా ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు, బ్యానర్లు, పోలీస్‌ స్టేషన్‌ లలో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు తదితర కార్యక్రమాలు ఈ నెల 31 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అమరులైన పోలీస్‌ కుటుంబ  సభ్యులను సన్మానించి వారికి జ్ఞాపికల ను అందజేశారు.  పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రాజీవ్‌ చౌరస్తా వరకు అమర పోలీసు వీరులకు జోహార్‌ అంటూ నినాదాలు చేస్తూ  ర్యాలీ నిర్వహించారు. అమర పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమస్యలు, సంక్షేమం గురించి అదనపు ఎస్పీ తె లుసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముని సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌లు వెంకట్‌, జగన్‌, కొత్తకోట సీఐ మళ్లికార్జున్‌రెడ్డి, ఆత్మకూరు సీఐ రత్నం, పట్టణ ఎస్సై మధుసూదన్‌, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌, ఎస్పీ పీఆర్‌వో రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:23:36+05:30 IST