పోలీసుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-10-22T05:18:11+05:30 IST

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను మరవులేనివని, వాటికి వెలకట్టలేమని సీపీ కార్తికేయ అన్నారు.

పోలీసుల త్యాగాలు మరువలేనివి
నివాళులు అర్పిస్తున్న సీపీ, అదనపు కలెక్టర్‌, పోలీసులు

వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ పనిచేయాలి
సీపీ కార్తికేయ
జిల్లా కేంద్రంలో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం
నిజామాబాద్‌, అక్టోబరు 21:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను మరవులేనివని, వాటికి వెలకట్టలేమని సీపీ కార్తికేయ అన్నారు. పోలీసు అ మరవీరుల దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌం డ్‌లో విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీ సు అమరవీరులకు నివాళ్లు అర్పించారు. ప్రతీ పోలీసు విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముం దుంటారన్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం దేశం మొత్తంలో విధి నిర్వహణలో 377 మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 24 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజల కోసం పనిచేయాలని కమిషనర్‌ అన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్పూర్తిని, విలువలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా అన్నారు. సమాజ అబివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికి అందాలం టే శాంతిభద్రతలు ముఖ్యమని ఆమె అన్నారు. దేశం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను విది నిర్వహణలో త్యాగం చేస్తున్నారన్నారు. ప్రతీ ఉద్యోగి సమాజంలో బాధ్యతగా మెలిగి అమరుల ఆశయ సాధనలు సాధించే దిశగా కృషి చేయాలని ఆమె అన్నారు. నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారన్నారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ముందుకు పోతున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డిప్యూటి కమిషనర్‌ అరవిందబాబు, అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్‌, గిరిరాజు, కామారెడ్డి అదనపు ఎస్పీ అనోణ్య, ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రావు, ఏఆర్‌డీఎస్పీ ఉదయకృష్ణ, స్పెషల్‌బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, ప్రసాద్‌, ఆర్‌ఐ శేఖర్‌, ఎంటీవో శైలేందర్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:18:11+05:30 IST