పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

ABN , First Publish Date - 2021-10-22T06:12:00+05:30 IST

విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల త్యాగాలు మరు వలేనివని, అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణలో ముందుండి వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
అమరువీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేస్తున్న డీసీపీలు

- అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి 

- డీసీపీలు రవీందర్‌, అశోక్‌ కుమార్‌

కోల్‌సిటీ, అక్టోబరు 21: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల త్యాగాలు మరు వలేనివని, అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణలో ముందుండి వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం కమిషనరేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఘనంగా నిర్వహించారు. అమరులస్తూపం వద్ద కాగడాలు వెలిగించి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీపీలు మాట్లాడుతూ రక్షణ అంటే గుర్తుకు వచ్చేది పోలీస్‌ అని, ఎవరైనా ఆపదలో గుర్తుకు వచ్చేది పోలీస్‌ అని, 24గంటలు విధుల్లో ఉండే ఉద్యోగం ఒక్క పోలీసులదేనని పేర్కొన్నారు.  అంతర్గత రక్షణలో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని, ఈ ఒక్క ఏడాది దేశంలో 377మంది వీరమరణం పొందారన్నారు. ఈ సందర్భంగా అమ రుల కుటుంబాల సమస్యలు తెలుసుకుని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇ చ్చారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేశారు. అ క్టోబర్‌ 31 వరకు పోలీస్‌ స్టేషన్లలో ఓపెన్‌హౌస్‌ కార్య క్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహించనునట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌, ఏసీపీలు గిరిప్రసాద్‌, స్పెషల్‌బ్రాంచ్‌ ఏసీపీ నారాయణ, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కమలాకర్‌, కమిషనరేట్‌ పోలీస్‌ సం ఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, ఏవో నాగమణి, ఇన్‌స్పెక్ట ర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఆర్‌, సివిల్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌,వన్‌టౌన్‌ సీఐ-2 రాజ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమా ర్‌,ఎస్‌ఐలు సతీష్‌, రమేష్‌, ఉమాసాగర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ ఐ నాగరాజు, పోలీస్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల స భ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:12:00+05:30 IST