ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదు

ABN , First Publish Date - 2022-01-19T06:11:16+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 341వ రోజు కొనసాగాయి

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదు
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌

కూర్మన్నపాలెం, జనవరి 18: ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 341వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో  యుటిలిటీస్‌, ఈఎండీ, ఈఎన్‌ఎండీ, సీఆర్‌ఎంపీ విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రధాని కార్పొరేట్‌ శక్తుల చేతిల్లో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు.  పోరాట కమిటీ మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ మోదీ ఎన్నికల ప్రచారంలో యువతకు ఉపాధి కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరాజు, దేవులపల్లి సంపూర్ణం, గంగవరం గోపి, సత్యనారాయణ, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, రాజీవ్‌, వెంకట్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:11:16+05:30 IST