టీటీడీ భూముల అమ్మకాలను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-05-27T10:11:55+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం భూము ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ..

టీటీడీ భూముల అమ్మకాలను నిలిపివేయాలి

ప్రభుత్వం జారీ చేసీ జీవోను రద్దు చేయాలి

బీజేపీ, జనసేన నేతల డిమాండ్‌ 

జిల్లావ్యాప్తంగా ఉపవాస దీక్షలు


ఒంగోలు (కలెక్టరేట్‌), మే 26: తిరుమల తిరుపతి దేవస్థానం భూము ల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉపవాస దీక్షలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పి లుపు మేరకు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శిరసన గండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆపార్టీనాయకులు, కార్య కర్తలు ఎక్కడక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ దీక్షలు చేపట్టారు.   అనేక ప్రాంతాల్లో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. 


ఒంగోలులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శిరసన గుండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ దేవాలయ భూముల జీవోను తాత్కాలి కంగా రద్దు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తున్నదన్నారు. అలాకాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింహాచలం భూముల అమ్మకం వంటి నిర్ణయాలను కూ డా వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, పవన్‌రాజు, నాగేశ్వరరావు, చిరంజీవి, వెంక టేశ్వరరావు, కొమ్మి నర్శింగరావు, భరద్వాజ, రాజశేఖర్‌, ధనిశెట్టి రాము., జేనసేన నాయకులు అడుసుమల్లి వెంకటరావు, బండారి సురేష్‌, చిట్టెం ప్రసాద్‌,సుబ్బారావు, రమేష్‌, రాంబాబు, రాయని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు   షేక్‌ ఖలీఫాతుల్లాబాషా, బీజేపీ రాష ్ట్రనాయకుడు కొమ్ము శ్రీనివాసరావుతోపాటు వివిధ హోదాల్లో పార్టీశ్రే ణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 


రాష్ట్రంలో నైతిక విలువల్లేని పాలన..

కొండపి: రాష్ట్రంలో నైతిక విలువల్లేని పాలన కొనసాగుతున్నదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈదర హరిబాబు విమర్శించారు. కొండపిలోని పార్టీ కార్యాలయంలో ఈదర  ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొడ్డపాటి బ్రహ్మయ్య, బీజేపీ మండల కన్వీనర్‌ బొడ్డపాటి వెంకట్రావు, జనసేన నాయకులు పి. బ్రహ్మయ్య పాల్గొన్నారు. 


మార్కాపురంలో జరిగిన దీక్షలో బీజేపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శాసనాల సరోజని, పైడిమర్రి శ్రీనివాస రావు, అసెంబ్లీ కన్వీనర్‌ చిన్నయ్య, మద్దెల లక్ష్మి, యక్కలి కమల్‌ గుప్తా, నాగేశ్వరరావు,  రమణా రావు తదితరులు పాల్గొన్నారు.


కందుకూరులో జరిగిన ఉపవాస దీక్షలో బీజేపీ నాయ కుడు దార్ల నరసింహం తదితరులు పాల్గొన్నారు. 


చినగంజాంలో జరిగిన దీక్షలో  బీజేపీ రాష్ట్ర కార్యవర ్గస భ్యుడు ఉలిచి ఏసుబాబు, జనసేన పర్చూరు నియోజకవర్గ కన్వీనర్‌ విజ య్‌కు మార్‌, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కోశాఽధికారి రేపాక మంగత యారు తదితరులు పాల్గొన్నారు. 


గిద్దలూరులో జరిగిన ఉపవాస దీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోగంటి శ్రీనివాసచౌదరి, నియోజకవర్గ కన్వీనర్‌ పిడతల సరస్వతి,  రాచర్ల కాసులు, రెడ్డి నాయక్‌, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కంభంలో చేపట్టిన దీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీవీ కృష్ణారావు, పల్లెం శ్రీనివాసులు, వేముల శ్రీనివాసులు, కట్టా శివకుమార్‌ పాల్గొన్నారు.


అద్దంకిలో జరిగిన దీక్షలో బీజేపీ  నాయకులు బంగారుబాబు, జవ్వా జి నాగమల్లి, రాయపాటి విష్ణు, కొండ్రగుంట  శ్రీనివాసరావు, జనసేన నా యకులు గోరంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు. 


వేటపాలెంలో చేపట్టిన దీక్షలో బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్‌కుమార్‌, వెంకట రమణారావు, కుమార్‌, భరణి రావు, జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరామప్రసాద్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


దర్శిలో జరిగిన దీక్షలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. లక్ష్మీనారాయణరెడ్డి, సీహెచ్‌ కొండయ్యశెట్టి, టి. జ్ఞానేశ్వరరావు, ఎస్‌. నర్శింహారావు, టి. కృష్ణప్రసాద్‌, వి.అమరేశ్వరరావు పాల్గొన్నారు.


కురిచేడులో బీజేపీ మండల నాయకులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో కమతం సుధాకర రెడ్డి, చెన్నంసెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు.


పామూరులో జరిగిన దీక్షలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ రమణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్యకొండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


తాళ్లూరులో జరిగిన ఉపవాస దీక్షలో బీజేపీ నేతలు మారం గోవిందరెడ్డి, చందోలు రామారావు, మాతయ్య, లక్కు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కనిగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరాల శ్రీనివాసులరెడ్డి, సోమిశెట్టి శ్రీనివాసులు, ఒలేటి రాధాక్రిష్ణమూర్తి, తిరుమ లయ్య, లక్ష్మణ ప్రసాద్‌, ప్రదీప్‌, మస్తానయ్య, శ్రీనివాస్‌, జగన్‌మోహన్‌ రావు, భవానీ, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:11:55+05:30 IST