ఇదే ప్రమాదకరం!

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైనది ఏదో చెప్పండి. పులి, సింహం, షార్క్‌... ఇలాంటి పేర్లు చెబితే ...

ఇదే ప్రమాదకరం!

ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైనది ఏదో చెప్పండి. పులి, సింహం, షార్క్‌... ఇలాంటి పేర్లు చెబితే మాత్రం మీరు పొరబడినట్టే! ఎందుకంటే అన్నింటికన్నా డేంజరస్‌ దోమ. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధృవీకరించింది. దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, యెల్లో ఫీవర్‌, చికున్‌గున్యా వంటి వ్యాధుల గురించి మీకు తెలిసిందే! దోమ కాటు వల్ల ఏటా 7 లక్షలకు పైగా జనం చనిపోతున్నారట. మరే జంతువు వల్ల ఏటా ఇంతమంది చనిపోవడం లేదట. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా దోమ మీకు కనిపిస్తుంది. దోమ జంతువు కాకపోయినా జంతురాజ్యంలోని ఒక కీటకం. మనిషికి ప్రమాదం పొంచి ఉంది దోమల వల్లే అని అనడంలో సందేహం లేదు కదూ! 

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST