ఇసుకే బంగారమాయె

ABN , First Publish Date - 2021-05-08T07:31:10+05:30 IST

మండలంలో ఇసుకే బంగారంలో మారింది. ఇసుక కొరతతో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.

ఇసుకే బంగారమాయె
ఇసుక లేక నిలిచిపోయిన కుర్రారం శ్మశానవాటిక పనులు

 ఇసుక కొరతతో నిలిచిన గృహ నిర్మాణాలు  

ఉపాధి కోల్పోతున్న కూలీలు  

ఇబ్బంది పడుతున్న ఇళ్ల నిర్మాణదారులు

 రాజాపేట, మే 7: మండలంలో ఇసుకే బంగారంలో మారింది. ఇసుక కొరతతో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. మండలంలో పారు పల్లి, పాముకుంట, చల్లూరు, బేగంపేట, రఘునాథపూర్‌, దూదివెంకటాపూర్‌ గ్రామాల్లో వాగులు ఉన్నాయి. మండ లంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ ఐదు గ్రామా ల్లోనే వాగులు ఉన్నందున ఇసుక తరలింపునకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ఆగి పోయాయి. మండలంలోని ప్రజలందరూ ఈ వాగులపైనే ఆధారపడి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇసుక తరలిం పు లో ఇటీవల అక్రమాలు జరిగాయని అధికారులు అనుమ తులు ఇవ్వనందున ఇసుక కొరత ఏర్పడింది. కొంతమంది రాత్రి వేళల్లో దొంగచాటుగా ఇసుకను తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.5వేల నుంచి రూ.6 వేలకు విక్రయి స్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ దారులకు ఇసుక కొనుగోలుచేయడం భారంగా మారింది. ప్రభుత్వ అభివృద్ధి పనులకు కూడా ఇసుకను అధికారులు అనుమతించనం దున నిర్మాణాలు ఆగిపోయాయి. మండలంలోని  కుర్రారం, బొందుగుల గ్రామాల్లో ఇసుక కొరతతో శ్మశానవాటిక నిర్మాణపనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇసుక దొరక నందున ప్రజలు ఇబ్బం ది పడుతున్నారు. కొవి డ్‌ మహమ్మారి సమ యంలో గృహనిర్మాణ పనులతో మాత్రమే  కూలీలకు ఉపాధిపను లు లభించగా, ప్రస్తుతం ఇసుక కొరత తో పనులు లేక కూలీలు పస్తులుం డాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇసుక కో సం చాలామంది చలాన్లు చెల్లించి నెల లు గడుస్తున్నా ఇసుకకు మాత్రం అనుమతి లభించడం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణదారులు ఇబ్బందిపడుతు న్నారు. ఇసుకకు అనుమతులు ఇవ్వా లని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-08T07:31:10+05:30 IST