పాఠశాల విలీన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి : డీఈవో

ABN , First Publish Date - 2022-01-20T04:59:30+05:30 IST

సమీప ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీన పక్రియ ఎటువంటి పొరపాట్లు లేకుం డా సమర్ధవంతంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు.

పాఠశాల విలీన ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలి : డీఈవో
ఆన్‌లైన్‌ విధానం గురించి వివరిస్తున్న దృశ్యం

సికెదిన్నె, జనవరి 19: సమీప ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీన పక్రియ ఎటువంటి పొరపాట్లు లేకుం డా సమర్ధవంతంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. మండలంలోని స్థానిక ఎమ్మార్సీ భవనంలో బుధవారం ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాథమిక పాఠశాలలను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్‌ చే యాలన్నారు. అనంతరం మూలవంకలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరామిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నిర్షాద్‌, శోభారాణి, ప్రకాష్‌, చంద్రశేఖర్‌, డీఈవో కార్యాలయ ఏఎ్‌సవో బ్రహ్మనందరెడ్డి, ఎంఐఎస్‌ ప్రతాప్‌, శ్రీను, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:59:30+05:30 IST