Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతను పాఠశాలలో స్పీపర్.. టాయిలెట్‌కు వచ్చే బాలికలను దొంగచాటుగా.. ఓ రోజు బాలిక ఒక్కటి ఉండగా..

కొందరు చిన్న వయసులోనే సైకోల్లా మారి.. ఊహించని దారుణాలకు ఒడిగడుతుంటారు. వారు పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం కూడా ఇందుకు కారణం కావొచ్చు. పిల్లలను మొదటి నుంచీ సక్రమంగా పెంచకపోతే.. చివరకు వారి జీవితాలనే నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. వారణాసిలో ఓ యువకుడు ఇలాగే చేశాడు. పాఠశాలలో స్పీపర్‌గా పని చేస్తున్న అతను.. రోజూ టాయిలెట్‌కు వచ్చే బాలికలను దొంగచాటుగా చూసేవాడు. ఓ రోజు బాలిక ఒక్కటి ఉందని గమనించి ఏం చేశాడంటే.. 

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని లహర్తరా లొకాలిటీ సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సింకు(23) అనే వ్యక్తి స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. తన పని తాను చేసుకుని వెళ్లుంటే.. ఏ సమస్యా ఉండేది కాదు. కానీ అతడు మాత్రం తనలోని సైకోయిజాన్ని బయటపెట్టాడు. రోజూ బాత్‌రూమ్‌కు వచ్చే బాలికలను దొంగచాటుగా చూసేవాడు. రోజూ ఇదే పనిగా పెట్టుకున్న అతను.. చివరకు ఇంతకు తెగిస్తాడని ఎవరూ ఊహించలేదు.

ఓ రోజు బాలిక ఒక్కటే టాయిలెట్‌కు వచ్చింది. ఇదే అదునుగా బావించి లోపలికి వెళ్లాడు. బాలికను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పేసి, బాలికను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడు. తన నుంచి తప్పించుకుని బయటపడ్డ బాలిక.. నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement