బడి తెరిచారు

ABN , First Publish Date - 2020-09-22T10:42:54+05:30 IST

సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం విధులకు హాజరయ్యారు. మంగళవారం నుంచి 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతారు.

బడి తెరిచారు

మొదటి రోజు 8,011 మంది హాజరు

నేటి నుంచి విధులకు 50 శాతం సిబ్బంది


కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 21: సుదీర్ఘ విరామం అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం విధులకు హాజరయ్యారు. మంగళవారం నుంచి 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతారు. సింగిల్‌ టీచర్‌ ఉన్నచోట ప్రతిరోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.


మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 9, 10 తరగతుల విద్యార్థులు మొత్తం 8,011 మంది పాఠశాలలకు హాజరయ్యారు. వీరిలో 9వ తరగతి విద్యార్థులు 4,128 మంది, 10వ తరగతి విద్యార్థులు 3,150 మంది ఉన్నారు. అందరూ మాస్కులు ధరించి వచ్చారు. తల్లిదండ్రుల అనుమతి పత్రాలను కొందరు మాత్రమే తెచ్చారు. మిగిలిన వారు మంగళవారం తీసుకురావాలని ఉపాధ్యాయులు సూచించారు.


9 నుంచి 12 తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలను నివృత్తి చేసుకునేందుకు మాత్రమే పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలోకి అనుమతి లేదు. కర్నూలు మండలం స్టాంటన్‌పురం, వసంతపురం, సిస్టర్‌ స్టాన్సిలాస్‌ పాఠశాలలను కర్నూలు డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి అనూరాధ, వెల్దుర్తి మండలం సూదెపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ తనిఖీ చేశారు. 


Updated Date - 2020-09-22T10:42:54+05:30 IST