Abn logo
Oct 18 2021 @ 00:57AM

భక్తుల కొంగుబంగారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి

అందంగా ముస్తాబైన స్వామివారి ఆలయం

సుర్జాపూర్‌లో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 

20న జాతర, రథోత్సవం 

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబరు 17: కోరిన కోర్కెలు తీర్చి.. భక్తుల కొం గుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు శనివారం నుంచి ఘనంగా ప్రాంరభం అయ్యాయి. మండలంలోని సుర్జాపూర్‌ గ్రామంలో ఏకశిలపైన వెలసిన స్వామివారి వార్షిక బ్రహ్మో త్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కాగా, 22 వరకు కొనసాగను న్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. వారం రోజుల పాటు వివిధ ఆధ్యాత్మి క కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా 18న నవగ్రహ యాగము, విష్ణు యాగము, బలిహరణ, 19న నిత్య హవనము, పండి తులు చక్రపాణి నర్సింహమూర్తిచే దోపుకథ కాలక్షేపం, 20న రథ ప్రాణ ప్రతిష్ఠ, రథబలి, రథోత్సవం, రాత్రి జాతర, 21న శేషహోమము, యాగశాల ప్రవేశం, 22న పుష్పయాగం, నాగవెళ్లి, గ్రామబలి, స్వామి వారి హెచ్చరికలు, ఏకాంత సేవా కార్యక్రమాలును స్థానాచార్యులు చక్ర పాణి వాసుదేవాచార్యులు, యజ్ఞాచార్యులు చక్రపాణి నర్సింహామూర్తి, అర్చకులు కోటపల్లి అవీష్‌ వేదమంత్రాలతో నిర్వహించనున్నారు. వార్షికో త్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ బ్రహోత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచే కాకుండా కరీంనగర్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించు కుంటారు. తులాభారం, కేశఖండన కార్యక్రమాలు చేస్తారు.