నేటి నుంచే రెండో విడత పట్టణ ప్రగతి

ABN , First Publish Date - 2020-06-01T10:28:35+05:30 IST

జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్ర మాన్ని నేటి నుంచి ప్రభుత్వం చేపట్టనుంది. ఇందు కు అనుగుణంగా

నేటి నుంచే రెండో విడత పట్టణ ప్రగతి

ఐదు మున్సిపాల్టీల్లో ఏర్పాట్లు చేసిన అధికారులు

ధర్మపురిలో ప్రారంభించనున్న మంత్రి కొప్పుల

కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాలలో ఎమ్మెల్యేలు సంజ య్‌, విద్యాసాగర్‌ రావు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల మే 31: జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్ర మాన్ని నేటి నుంచి ప్రభుత్వం చేపట్టనుంది. ఇందు కు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా పారిశుధ్య పరిరక్షణపై అధికా రులు దృష్టి సారిస్తున్నారు. 


ధర్మపురిలో ప్రారంభించనున్న మంత్రి కొప్పుల..

ధర్మపురి మున్సిపాల్టీలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్స్‌లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల, రాయికల్‌ మున్సిపల్స్‌ల లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌లు పట్టణ ప్ర గతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈనెల 1వ తేది నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధానంగా పారిశుధ్య పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణలపై దృష్టి సారించి ప్రత్యేక చర్య లు చేపట్టనున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు వార్డు కమిటీ సభ్యులు, యువజన, మహిళా సంఘాల సభ్యులు, సీనియర్‌ సిటిజెన్స్‌ల భాగస్వా మ్యం చేయనున్నారు. 


పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి....

రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్ర ధానంగా పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతీ రో జు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చేపట్టను న్నారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయి ల్‌ బాల్స్‌ వేయడం, దోమల నివారణకు ప్రత్యేక చర్య లు తీసుకోవడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.  ఎవరికి వారు తమతమ ఇళ్లలో క్రిష్ణ తులసి, పుదీనా వంటి మొక్కలను పెంచేలా ప్రోత్సహించనున్నారు.  వారంలో కనీసం ఒక్క రోజు బస్టాండ్లు, మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రేషన్‌ దుకాణాలు తదిత ర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఇతర పరిశు భ్రత చర్యలు తీసుకోవడం వంటి వాటిపై అధికారు లు దృష్టి సారిస్తున్నారు.


ప్రజారోగ్యం, పారిశుధ్య ప నులతో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలను సైతం పట్టణ ప్రగతిలో అధి కారులు ప్రజలకు వివరించనున్నారు. కలెక్టర్‌ రవి నేతృత్వంలో మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారు లు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని లక్ష్యం మేరకు వి జయవంతం చేయడంపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు. దీంతో బల్ధియాల్లో పరిశుభ్రత, సంక్షే మం, అభివృద్ది పరుగులు పెట్టనుందన్న అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి.


Updated Date - 2020-06-01T10:28:35+05:30 IST