రెండో విడత నిజాంసాగర్‌ నీటి విడుదల

ABN , First Publish Date - 2021-01-18T05:10:27+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజె క్టు నుంచి రెండో విడత నీటి విడుదల ఆదివారం నుంచి విడుదల చేస్తున్నారు.

రెండో విడత నిజాంసాగర్‌ నీటి విడుదల
ప్రధాన కాల్వ ద్వారా విడుదలవుతున్న నీరు

నిజాంసాగర్‌, జనవరి 17: నిజాంసాగర్‌ ప్రాజె క్టు నుంచి రెండో విడత నీటి విడుదల ఆదివారం నుంచి విడుదల చేస్తున్నారు. ప్రధాన కాల్వ వెంట 1400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు న్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో 1405 అడుగు లకు గాను 1403.14 అడుగుల నీటి సామర్థ్యం కలిగి ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం 15.171 టీఎం సీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని విద్యుత్‌ టర్బయిన్ల ద్వారా విడుదల చేస్తు ండటంతో రెండు టర్బయిన్ల ద్వారా 6.9 మెగావా ట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. మొదటి టర్బయి న్‌ 3.5మెగావాట్లు, రెండో టర్బయిన్‌ 3.4 మెగావా ట్ల చొప్పున విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని జెన్‌కో ఏఈ నితిన్‌ తెలిపారు. యాసంగి సాగు కోసం నిజాంసాగర్‌ నుంచి ఏడు విడతలుగా నీరు విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిం చారు. డిసెంబరు 16న మొదటి విడత నీరు విడుదల చేయగా, రెండో విడత జనవరి 17, 2021 నుంచి విడుదల ప్రారంభించారు. 15 రోజు ల పాటు ఈ నీటి విడుదల కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-01-18T05:10:27+05:30 IST